- Telugu News Photo Gallery Cricket photos SRH Captain Pat Cummins Master Plan Worked Against Mumbai Indians, For Huge Victory, Details Here
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా రూ. 20 కోట్లు ముట్టజెప్పింది..
ఈ మ్యాచ్‌లో చివర్లో ముంబై తడబడటానికి.. హైదరాబాద్ గెలవడానికి.. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్సే కారణమని తెలుస్తోంది. ముంబైని ట్రాప్ చేసి.. టోర్నీలో మొదటి విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి.. కమిన్స్ డెత్ ఓవర్లలో ముంబై ఇండియన్స్ హార్డ్ హిట్టర్లను ఎలా కంట్రోల్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందామా..
Updated on: Mar 29, 2024 | 4:57 PM

ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 40 ఓవర్లలో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ఆ తర్వాత 5 వికెట్లు నష్టపోయి 246 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో చివర్లో ముంబై తడబడటానికి.. హైదరాబాద్ గెలవడానికి.. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్సే కారణమని తెలుస్తోంది. ముంబైని ట్రాప్ చేసి.. టోర్నీలో మొదటి విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి 10 ఓవర్లకు 148 పరుగులు చేస్తే.. పది ఓవర్లలో ముంబై 141 పరుగులు చేసింది. నిర్దేశించిన 278 పరుగుల భారీ టార్గెట్‌ను గట్టిగానే ఆరంభించింది ముంబై.. కానీ ఆ జట్టు హార్డ్ హిట్టర్లు వచ్చే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ మాస్టర్ ప్లాన్ చేశాడు. తద్వారా హైదరాబాద్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

ముంబై ఇండియన్స్ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఎక్కువగా లెగ్ సైడ్ బ్యాటింగ్ చేస్తాడు. అయితే కెప్టెన్ కమిన్స్ తెలివిగా అతడి చేతులు కట్టేసి.. బంతులను అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయించాడు. ఆఫ్ సైడ్ దూరంగా బంతులు పడటంతో.. డేవిడ్ వాటిని బౌండరీలకు తరలించలేక.. సింగిల్స్‌తో సరిపెట్టుకున్నాడు.

తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ విషయంలో కమిన్స్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ కావడంతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. ఇది ఫెయిల్ అయి ఉంటే.. అంతటి భారీ స్కోర్ చేసినా.. సన్‌రైజర్స్ ఓటమి చవి చూడాల్సి వచ్చేది. ఇక కమిన్స్ కెప్టెన్సీ స్కిల్స్‌కు హైదరాబాద్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇందుకే కదా రూ. 20.50 కోట్లు ఇచ్చి కమిన్స్‌ను కొనుగోలు చేసిందని SRH ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.




