AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: శుక్రుడి విశేష అనుగ్రహం.. ఫిబ్రవరి 15 తరువాత ఈ నాలుగు రాశుల వారి భవిష్యత్ దేదీప్యమానం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 15 తరువాత శుక్రుని రాశిలో మార్పు కారణంగా శుభకరమైన, ప్రయోజనకరమైన కలయిక జరుగబోతోంది. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు.

Zodiac Signs: శుక్రుడి విశేష అనుగ్రహం.. ఫిబ్రవరి 15 తరువాత ఈ నాలుగు రాశుల వారి భవిష్యత్ దేదీప్యమానం..
Zodiac Signs
Shiva Prajapati
|

Updated on: Feb 03, 2023 | 1:52 PM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 15 తరువాత శుక్రుని రాశిలో మార్పు కారణంగా శుభకరమైన, ప్రయోజనకరమైన కలయిక జరుగబోతోంది. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. గురుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన మీన రాశిలో కూర్చున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిల.. కొందరికి ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. మీనరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం అనేది.. ఉన్నతమైన దశగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని శుభప్రదంగా పరిగణిస్తారు. శుక్రుడు ఆనందం, తేజస్సు, శ్రేయస్సు, సకల సౌభాగ్యాలకు కారకుడిగా పేర్కొంటారు.

ఫిబ్రవరి 15 న, శుక్రుడు తన ఉచ్ఛ రాశిలో ఉండటం, మీనరాశిలో బృహస్పతితో కలయిక ఏర్పడటం వలన శుభ ప్రభావాలు పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం తన సొంత రాశిలో గానీ, ఉన్నతమైన రాశిలో గానీ ఉంటే మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగం చాలా శుభప్రదమైనది. సంపద, ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. శుక్రుని సంచారము వలన కొన్ని రాశులకు చెందిన వారికి విశేష ప్రయోజనాలు చేకూరే సూచనలు ఉన్నాయి. ఆ రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం..

మిథునరాశి..

ఫిబ్రవరి 15 న శుక్రుడు స్థాన చలనం వల.. మిథునరాశి వారికి అన్నీ శుభాలే జరుగుతాయి. పని చేసే ప్రదేశంలో, ఇంట్లో అంతా సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. మాళవ్య రాజయోగం వల్ల మిథున రాశి వారికి చాలా ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. మరోవైపు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా సువర్ణావకాశం లభిస్తుంది. అనేక అద్భుత ఉద్యోగావకాశాలు ఏకకాలంలో దొరుకుతాయి. ఆకస్మిక ధనలాభం సంకేతాలు ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మాళవ్య రాజయోగం ఏర్పడటం వల్ల భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి నాల్గవ పాదంలో శుక్రుడు సంచించబోతున్నాడు. ఈ కారణంగా ధనుస్సు రాశి వారిని అదృష్టాన్ని వరించనున్నారు. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. వ్యాపారస్తులు ఏదైనా కొత్త ప్రణాళికలలో పనిని ప్రారంభించవచ్చు. చేపట్టిన ప్రతి పని వారికి మంచి పలితాలను ఇస్తుంది. అంతేకాకుండా, వ్యాపారం మొదలైన వాటిలో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో పెద్ద శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగానికి మంచి అవకాశాలు లభిస్తాయి.

మీనరాశి..

మీన రాశిలో శుక్రుని సంచారం మొదటి పాదంలో ఉంటుంది. మాళవ్య రాజయోగం వల్ల మీ మనసులో చాలా మంచి ఆలోచనలు, సానుకూలత వస్తాయి. తద్వారా మీలో మీపై విశ్వాసం పెరుగుతుంది. గౌరవం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. మిమ్మల్ని అదృష్టం వరించనుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి శుక్రగ్రహ సంచారము పెద్ద వరం అని చెప్పాలి. సంపద పెరుగుదల, మానసిక ప్రశాంతత ఉంటుంది.

కన్యారాశి..

శుక్రుడు రాశి మారడం వల్ల ఏర్పడిన మాళవ్య రాజయోగం కన్యారాశి వారికి ఫలితాలనిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. డబ్బు చేతికి అందుతుకుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మాళవ్య రాజయోగం ప్రభావంతో.. కష్టమైన పనులను కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ