Tirumala: తిరుమలలో అర్చకులు, క్షురకుల డబ్బుల దందా.. ఈఓకి భక్తుల ఫిర్యాదు
తిరుమలలో పుష్పాలు శ్రీవారికే అంకితం.. కనుక తిరుమలలో మహిళలు పుష్పాలు ధరించకూడదని ఈవో ధర్మారెడ్డి శ్రీవారి భక్తులు కోరారు..
తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మాట్లాడారు. తిరుమలలో జరిగిన రథసప్తమి వేడుకలకు భక్తులు విశేషంగా తరలివచ్చారని.. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని చెప్పారు ధర్మారెడ్డి. అంతేకాదు జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలని.. మొత్తం జనవరి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.123 కోట్లని వెల్లడించారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.51 లక్షలు కాగా అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు 37.38 లక్షలని తెలిపారు. భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించామని చెప్పారు.
తిరుమలలో పుష్పాలు శ్రీవారికే అంకితం.. కనుక తిరుమలలో మహిళలు పుష్పాలు ధరించకూడదని ఈవో ధర్మారెడ్డి శ్రీవారి భక్తులు కోరారు.. మరోవైపు కొందరు అర్చకులు, క్షురకులు భక్తులను డబ్బులు అడుగుతున్నారని తమకు ఫిర్యాదు వచ్చాయని ఈ విషయంపై దృష్టి సారిస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు.
నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత శ్రీ మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాని స్పష్టం చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..