Diwali 2021: దీపావళి స్పెషల్.. ఇంట్లో దక్షిణవైపు దీపాలను ఎందుకు పెడతారో తెలుసా ?
దీపావళీ అంటేనే దీపాల పండగ.. దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఈ పండగను జరుపుకుంటారు. ఇళ్లంతా దీపాలతో ఎంతో అందంగా అలకరించి.
దీపావళీ అంటేనే దీపాల పండగ.. దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఈ పండగను జరుపుకుంటారు. ఇళ్లంతా దీపాలతో ఎంతో అందంగా అలకరించి..లక్ష్మీదేవిని ఆరాధించి.. మిఠాయిలు పంచుతూ ఎంతో అంగరంగ వైభవంగా దీపావళీని జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మరికొన్ని చోట్లు ఐదు రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుల త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నాడు తమ వారసును అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని.. వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణంవైపు దీపం పెట్టాలని పెద్దలు అంటుంటారు. దీనినే యమ దీపం అని కూడా అంటారు..
ఈ యమదీపారాధన చేసిన వారి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. తల్లిదండ్రులు గతించిన వారు మాత్రమే ఈ యమ దీపం పెడతారు. నరక చతుర్దశి రోడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం. అమావాస్య రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. ఇక అమావాస్య తర్వాతీ రోజు కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమిగా చేసుకుంటారు. విదియ రోజు యమ ద్వితీయగా జరుపుకుంటారు. ఆరోజున అన్నదమ్ములు.. తమ అక్కాచెల్లెళ్ల చేతి వంట తినాలని అంటుంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలని ఈ పండగు.. సంప్రదాయం తెలియజేస్తుంది. ఇక ఈరోజున నెయ్యితో దీపాలను వెలిగించాలి. అలాగే దీపం వెలిగించడానికి పొద్దు తిరుగుడు నూనెను వెలిగించవద్దు.
Also Read: Happy Diwali 2021: దేశ ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..
Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..
Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..