AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..

మిల్కీబ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.. ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు యంగ్

Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..
Tamanna
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2021 | 7:55 AM

Share

మిల్కీబ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.. ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్‏కు స్ట్రాంగ్ పోటీ ఇస్తూ వరుస ఆఫర్లను కొల్లగొడుతుంది. బుల్లితెర.. వెండితెరపై సత్తా చాటుతూనే .. అటు డిజిటల్ రంగంలోనూ రాణిస్తోంది. ఇక ఇప్పటివరకు హీరోయిన్‏గా నటిస్తూ ప్రేక్షకులను అలరించిన తమన్నా.. ఇటీవల నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమాతో సరికొత్త ప్రయత్నం చేసింది. మొదటి సారి విలన్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది. మ్యాస్ట్రో సినిమాలో మిల్కీబ్యూటీ నటనకు అంతా ఫిదా అయ్యారు.. ప్రస్తుతం ఈ అమ్మడు ఎఫ్ 3 సినిమా చేస్తుంది. ఇందులో వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే… తాజాగా తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. తమిళ మూవీ వేదాళంకు తెలుగు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమన్నా.. ఈ మూవీ కోసం భారీగానే ప్యాకేజ్ తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. భోళా శంకర్ సినిమా కోసం మిల్కీబ్యూటీ దాదాపు 3 కోట్లు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇప్పటికే సగం అడ్వాన్స్ కూడా మేకర్స్ అప్పగించారని ఇన్ సైడ్ టాక్. ఇక ఇప్పటివరకు తమన్నా.. తన కెరీర్‏లో ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోలేదట. గతంలో చిరంజీవితో కలసి సైరా నరసింహా రెడ్డి మూవీలో కీలక పాత్రలో నటించింది తమన్నా. ఇక ఈ సినిమా ఈ నెల 11న పూజా కార్యక్రమాలు జరుపుకుని.. 15 నుంచి సెట్స్ పైకీ వెళ్లనుంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు