AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..

Vijay Sethupathi: తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా ఈ స్టార్ హీరో అంటే..

Vijay Sethupathi: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..
Vijay Sethupathi
Rajitha Chanti
| Edited By: Subhash Goud|

Updated on: Nov 03, 2021 | 10:20 PM

Share

Vijay Sethupathi: తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా ఈ స్టార్ హీరో అంటే పడిచచ్చే అభిమానులున్నారు. ఉప్పెన సినిమాలో విజయ్ పాత్రకు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.. తన నటనతో యూత్‏ను మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‏ను కూడా విజయ్ ఆకట్టుకున్నాడు.. ఇక విజయ్ సేతుపతిని చూడాలని.. కలవాలని.. తమిళ్… తెలుగు అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అలాంటి క్రేజ్ ఉన్న స్టార్ హీరోకు తాజా బెంగుళూరు ఎయిర్ పోర్ట్‏లో చేదు అనుభవం ఎదురైంది. విమానం దిగి వెళ్తుండగా.. ఓ ఆగంతుకుడు వెనకనుంచి వచ్చి విజయ్ సేతుపతిని ఎగిరి తన్నేందుకు యత్నించాడు.. ఊహించని ఈ సంఘటనతో విజయ్ సేతుపతితోపాటు.. అక్కడున్నవారంత షాక్ అయ్యారు.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్భంది ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు.

అలాగే.. మరోవైపు.. విజయ్ సేతుపతిని క్షేమంగా తీసుకెళ్లారు భద్రతా సిబ్భంది. అయితే విజయ్ పై దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన బెంగుళూరు ఎయిర్ పోర్టులో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయ్ వెళ్తున్నట్లుగా సమాచారం. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ ఆగంతకుడు మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తనపై జరిగిన దాడికి విజయ్ ఒక్కసారిగా షాకయ్యారు… అలాగే ఎయిర్ పోర్ట్ భద్రతపై కాస్త అసహంగానూ ఉన్నట్లుగా తెలుస్తోంది..

ఇదిలా ఉంటే.. విజయ్ దాడి దృష్యాలు నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల తమిళ హీరోలు స్పందించలేదు.. అంతేకాకుండా.. నివాళులు కూడా అర్పించలేదు. బాలీవుడ్.. టాలీవుడ్ హీరోలు నివాళులర్పించేందుకు వచ్చినా.. తమిళ హీరోలు మాత్రం తమకేం పట్టనట్లుగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు..దీంతో తమళ హీరోలపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Samantha: బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత.. ఆ స్టార్ హీరోయిన్‏తో కలిసి సామ్ భారీ ప్రాజెక్ట్..

Bheemla Nayak: దీపావళి ముందే వచ్చేసింది.. లాలా భీమ్లా సాంగ్ ప్రోమో అదుర్స్ అంతే…

Sreeleela: టాలీవుడ్‏లో శ్రీలీలకు పెరుగుతున్న క్రేజ్.. క్యూ కడుతున్న ఆఫర్స్..