Diwali 2021: దీపావళీ రోజు స్త్రీలు ఇంట్లోవాళ్లకు ఎందుకు హారతులు ఇస్తారో తెలుసా ?.. స్టోరీ తెలుసుకోండి..
మన భారతీయ సంప్రదాయంలో ఎన్నో ప్రత్యేక రోజులు.. పండుగలు ఉన్నాయి. ఇందులో ఒక్కో పండగకు కొన్ని సంప్రదాయాలు.
మన భారతీయ సంప్రదాయంలో ఎన్నో ప్రత్యేక రోజులు.. పండుగలు ఉన్నాయి. ఇందులో ఒక్కో పండగకు కొన్ని సంప్రదాయాలు.. వాటి వెనక ఎన్నో అర్థాలున్నాయి. ప్రతి వేడుకను ఎంతో ఘనంగా.. సంప్రదాయబద్దంగా జరుపుకుంటాం.. లక్ష్మీదేవి పుట్టినరోజున అమ్మవారికి మన నివాసంలోకి ఆహ్వానిస్తాం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ది పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ నానా ఇబ్బందులకు గురిచేసేవాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి.. భూదేవికి అసుర సంధ్యా సమయంలో నరకాసురుడు జన్మిస్తాడు.. అయితే నరకాసురుడిని వధించేందుకు కేవలం భూదేవికి మాత్రమే అవకాశం ఉంటుంది..
ఇక ద్వాపర యుగంలో మహావిష్ణువు.. శ్రీకృష్ణుడిగా.. భూదేవి సత్యభామాగా జన్మిస్తారు. మరోవైపు నరకాసురుడు జనాలను పీడిస్తూ వేధిస్తుంటాడు. నరకాసురిడి ఆకృత్యాలను ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని.. అతడిని ఎలాగైనా వధించాలని భావిస్తారు మహావిష్ణువు.. సత్యభామ బాణాలకు నరకాసురుడు మరణిస్తాడు.. నరకాసురుడు మరణించిన రోజును నరక చతుర్దశిగా పిలుస్తారు. ఈరోజున వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు అంటే సూర్యోదయానికి ముందు దేవతలకూ.. బ్రాహ్మణులకూ.. పెద్దలకు.. తల్లికి, గోవులకు హారతులు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవాలనేది శాస్త్రంలో ఉంటుంది. ఆ తర్వాత అభ్యంగన స్నానం చేసి.. దేవతలను పూజించాలి. అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లలకు తలపై నువ్వుల నూనె అంటి.. నుదుట కుంకుమ బొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలనేది ఈ హారతుల పరమార్థం. అలాగే ప్రతిరోజ మంగళప్రదంగా కొనసాగాలని ఆడపడుచుల నుంచి హారతులు అందుకొని, యథాశక్తి వారికి బహుమతులు సమర్పిస్తారు. దీపావళి సందర్భంగా అపమృత్యుదోషం నశించడం కోసం నరకాధిపతి యముడి ప్రీత్యర్థం దీపదానం కూడా చేస్తారు. ఆ తర్వాత అమావాస్య రాత్రి లక్ష్మీ పూజ చేసి… కానుకలను అందిస్తారు.
Also Read: Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..
Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..
Bigg Boss 5 Telugu: నారీ నారీ నడుమ మురారీ.. జెస్సీ ఆశలు మాములుగా లేవుగా..