Narakasura Vadha: ఒంగోలులో ఘనంగా జరిగిన నరకాసుర వధ కార్యక్రమం.. భారీగా తరలివచ్చిన భక్తజనం
Narakasura Vadha: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ దీపావళి వేడుకల్లో భాగంగా అన్ని ప్రాంతాలవారు దీపాలను..
Narakasura Vadha: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ దీపావళి వేడుకల్లో భాగంగా అన్ని ప్రాంతాలవారు దీపాలను వెలిగిస్తారు. బాణా సంచా కాలుస్తారు. అయితే పూజాది కార్యక్రమాలను మాత్రం వివిధ ప్రాంతాల్లో విభిన్నంగా ఉంటాయి. ఉత్తరాదిన దీపావళి వేడుకలను ఐదు రోజులు ఘనంగా జరుపుకుంటారు. అయితే దక్షిణాదిన దీపావళి వేడుకలు కూడా భిన్నంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలను రెండు రోజులు జరుపుకుంటారు. నరక చతుర్ధిశి, దీపావళిగా పండగను నిర్వహిస్తారు.
ఒంగోలులో నరకాసుర వధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. 1902 నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారే వరకూ ఈ నరకాసుర వధ ఘట్టం కొనసాగుతుంది. ఒంగోలులో తొలుత శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కొంతమంది మిత్రులు కలిసి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి 39 అడుగుట భారీ నరకాసురుని బొమ్మను ఏర్పాటు చేశారు. నగరంలోని సివియన్ రీడింగ్ రూం సమీపంలో చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర ఈ బొమ్మను రోడ్డుపై నిలబెట్టారు. అనంతరం బాణాసంచా పేల్చి బొమ్మను కాల్చారు… ఈ ఘట్టాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
Also Read: కాల్వగట్టున కనిపించే ఈ కలుపుమొక్క చెట్టు పాలతో తేలు కాటు విషానికి చెక్…