Yadadri Temple: డ్రోన్ కెమెరాల్లో యాదాద్రి ఆలయం.. కట్టిపడేస్తున్న సుందర దృశ్యాలు..
తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా చెప్పుకుంటోన్న యాదాద్రి క్షేత్రం వడివడిగా రూపుదిద్దుకుంటోంది. ప్రభుత్వం కూడా ప్రతిష్ఠాత్మక తీసుకొనడంతో..
తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా చెప్పుకుంటోన్న యాదాద్రి క్షేత్రం వడివడిగా ముస్తాబవుతోంది. ప్రభుత్వం కూడా ప్రతిష్ఠాత్మక తీసుకొనడంతో అధికారులు శరవేగంగా ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా చోళ, కాకతీయ, పల్లవ శిల్ప కళాకృతుల సమ్మేళనంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయాన్ని 2.33 ఎకరాల విస్తీర్ణంతో ఆగమ, శిల్ప వాస్తు శాస్త్రాల ప్రకారం కృష్ణ శిలలతో నిర్మించనున్నారు. ఇక ఆలయం చుట్టూ ప్రాకార రాజగోపురాలు, కళాత్మక ఉద్యానవనాలు భక్తులకు మరింత ఆహ్లాదం కలిగించనున్నాయి.
భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయం చుట్టూ సువిశాల రహదారులు, ఆధునిక వసతులతో కూడిన కాటేజీలను నిర్మిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలతో కూడిన ఈ ఆలయ దర్శనాలను వచ్చ ఏడాది మార్చిలో ప్రారంభించనున్నారు. 2022 మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం జరిగిన తర్వాత భక్తుల దర్శనానికి అనుమతినివ్వనున్నారు. అంతకు ఎనిమిది రోజుల ముందు శాస్త్రోక్తంగా మహాసుదర్శన హోమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ ఆలయానికి సంబంధించి పర్యటక శాఖ తాజాగా వీడియోను విడుదల చేసింది. డ్రోన్ కెమెరాలతో తీసిన ఈ కమనీయ దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. మరి ఈ అద్భుతమైన వీడియోను మీరూ చూసేయండి.
Here’s the Magical Glance of YADADRI TEMPLE ✨✨#Yadadri#YadagiriGutta #YadadriTemple https://t.co/Hq21makVq4 pic.twitter.com/6e1hU7y3H8
— Chanduuuuu ?☄️ (@Imcckr) November 3, 2021
Also read:
Diwali 2021: సుఖ సంతోషాలతో ఉండాలంటే దీపావళి ముందురోజు ఈ 5 పనులు చేయాలి..!