AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021: దీపావళి రోజున లక్ష్మీ, గణేషుడి విగ్రహాలు కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..

Diwali 2021: దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రజలు దీపావళిని ఇవాళ్టి నుంచే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే దీపావళి రోజున ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్లలో గణేషుడు

Diwali 2021: దీపావళి రోజున లక్ష్మీ, గణేషుడి విగ్రహాలు కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..
Ganesh Laxmi Idel
Shiva Prajapati
|

Updated on: Nov 03, 2021 | 10:07 PM

Share

Diwali 2021: దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రజలు దీపావళిని ఇవాళ్టి నుంచే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే దీపావళి రోజున ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్లలో గణేషుడు, లక్ష్మీ మాతను పూజిస్తారనే విషయం తెలిసిందే. మాతా లక్ష్మి దేవిని సంపదను కలుగజేస్తుందని విశ్వసిస్తారు. లక్ష్మీదేవి కొలువైన ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతారు. అయితే, లక్ష్మీ దేవి చంచల స్వభావాన్ని కలిగి ఉంటుందని, ఎప్పుడూ ఒకే చోట ఉండదని కూడా అంటారు. అందుకే, లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండాలనుకుంటే, గణపతిని పూజించడం తప్పనిసరిగా చేయాలంటారు. గణపతిని కూడా ఐశ్యర్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఐశ్యర్యం ఉన్నప్పుడే తల్లి లక్ష్మి నివాసం ఉంటుంది. అందుకనే.. దీపావళి రోజున గణేషుడుతో పాటు.. లక్ష్మీ మాత విగ్రహాన్ని తీసుకువస్తారు. గణుషుడు, లక్ష్మీ దేవి విగ్రహాలను పూజించడం వలన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందంటున్నారు వేదపండితులు. అయితే, గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాంటి గణపతి విగ్రహం తీసుకోవాలి.. 1. గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేటపుడు విగ్రహంలో తప్పనిసరిగా ఆయన వాహనమైన ఎలుక కూడా ఉండాలి. అలాగే వినాయకుడి చేతిలో లడ్డూలు, మోదకాలు ఉండాలి. ఇలాంటి విగ్రహాలు శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడతాయి. 2. మార్కెట్‌లో చాలా వరకు లక్ష్మీ గణేష్ విగ్రహాలు కలిసి ఉంటాయి. అయితే, అలా కలిసి ఉన్న విగ్రహాలు తీసుకోవద్దు. లక్ష్మీ మాత, గణపతి విగ్రహాలు విడివిడిగా ఉండేలా తీసుకోవాలి. 3. వినాయకుని విగ్రహాన్ని కొనుగోలు చేసేటపుడు తొండాన్ని గమనించాలి. తొండం ఒకటి కంటే ఎక్కువ మెలికలు తిరగకుండా ఉన్న విగ్రహాలు తీసుకోవాలి. అందులోనూ తొండ ఎడమవైపునకు తిరిగి ఉన్నది తీసుకోవాలి.

లక్ష్మీదేవి విగ్రహం ఎలా ఉండాలి.. 1. ఇంట్లో ఎప్పుడూ కూర్చునే మాతా లక్ష్మిని తీసుకురావాలి. నిలబడి ఉన్న లక్ష్మి కదులుతున్నట్లు భావిస్తారు. స్థిరమైన లక్ష్మి కోసం కూర్చున్న లక్ష్మిదేవిని మాత్రమే ఇంటికి తీసుకురావాలి. తద్వారా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. 2. లక్ష్మీదేవి కమలం లేదా ఏనుగుపై కూర్చున్న విగ్రహాలను మాత్రమే తీసుకురావాలి. 3. మాతా లక్ష్మి దేవిని సంపదకు దేవతగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆమే చిత్రపటం, విగ్రహంలో సంపద వర్షం కురిసేలా ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. ఇలాంటి చిత్రపటం, విగ్రహం కొనుగోలు చేయడం ద్వారా కుంటుంలో డబ్బు కొరత కూడా తీరుతుందని విశ్వాసం.

మరో కీలక విషయం.. దీపావళి రోజున మీరు మట్టి విగ్రహాన్ని తీసుకువచ్చినట్లయితే.. ఇంట్లో ఉన్న పాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి. పాత విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. అయితే, ఇత్తడి, బంగారం, వెండి వంటి లోహంతో కూడిన విగ్రహాలు తీసుకువస్తే వాటిని తొలగించాల్నిన అవసరం లేదు. నిత్యం ఆ విగ్రహాలకు పూజలు చేయొచ్చు.

Also read:

Crime News: బెలూన్ ఊదుతూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారి.. అసలు ఎలా జరిగిందంటే..

Lungs Cancer: పెరుగుతున్న కాలుష్యంతో ముప్పు.. వీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అంతే సంగతులు..

Diwali 2021: దీపావళి బంపర్ ఆఫర్.. హోండా కారు కొనుగోలుపై రూ.38,000 వరకు తగ్గింపు..