Crime News: బెలూన్ ఊదుతూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారి.. అసలు ఎలా జరిగిందంటే..
Child Died: సరదాగా ఆడుకునే గాలి బుడగ ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. గాలిబుడగ ఊదుతుండగా అదికాస్తా గొంతులోకి జారడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
Child Died: సరదాగా ఆడుకునే గాలి బుడగ ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. గాలిబుడగ ఊదుతుండగా అదికాస్తా గొంతులోకి జారడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌లోని నందనవన్ ప్రాంతం స్వరాజ్ విహార్ కాలనీకి చెందిన 6 ఏళ్ల చిన్నారి బెలూన్లతో ఇంటి బయట ఆడుకుంటోంది. చిన్నారి గాలి బుడను ఊదుతుండగా.. ఒక్కసారిగా గాలి లోపలికి పీల్చుకోవడంతో అది కాస్తా గొంతులోకి వెళ్లింది. దాంతో ఆ గాలి బుడగ గొంతులో ఇరుక్కుపోయింది. గొంతులో ఇరుక్కుపోయిన గాలి బుడగను బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు. చివరికి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించి వైద్యులు.. చిన్నారి చనిపోయినట్లు ధృవీకరించారు. గాలిబుడగ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. నాగ్‌పూర్ టౌన్‌లోనే మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న 51 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇమాంబరా ప్రాంతంలోని అశోక్ చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి మతియుద్ధీన్ మోమినుద్దీన్ షేక్‌గా గుర్తించగా, గాయపడిన వ్యక్తిని మహ్మద్ హరూఫ్ మహ్మద్ గఫూర్ షేక్(52) గా గుర్తించారు పోలీసులు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించగా.. చనిపోయిన వ్యక్తి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Indian Army: ఇండియన్ ఆర్మీ జాబ్‌లకి రెండేళ్లు వయసు పెంచారా..! నిబంధనలు తెలుసుకోండి..