AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: బద్వేల్ బైపోల్ వార్ ఎఫెక్ట్.. ఏపీలో పొత్తుల రచ్చ.. జనసేనాని హాట్ కామెంట్స్‌తో మారిన రాజకీయ ముఖచిత్రం..!

Big News Big Debate: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతుగా వచ్చిన పవన్‌..

Big News Big Debate: బద్వేల్ బైపోల్ వార్ ఎఫెక్ట్.. ఏపీలో పొత్తుల రచ్చ.. జనసేనాని హాట్ కామెంట్స్‌తో మారిన రాజకీయ ముఖచిత్రం..!
Ap Politivs
Shiva Prajapati
|

Updated on: Nov 03, 2021 | 9:07 PM

Share

Big News Big Debate: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతుగా వచ్చిన పవన్‌.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ కార్నర్‌ చేస్తోంది. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్టులో భాగంగానే పవన్‌ రాష్ట్రాన్ని నిలదీస్తున్నారని వైసీపీ ఆరోపించింది. టీడీపీతో పొత్తే ఉంటే అసెంబ్లీలో కూర్చుని మీ తాట తీసేవాళ్లమని.. రహస్య బందాలు లేవని సమాధానమిస్తోంది జనసేన.

ఏపీలో పొలిటికల్‌ ఫీవర్‌ మొదలైంది.. వచ్చే ఏడాది నుంచే ఎన్నికలకు సిద్దమవ్వాలంటున్న జనసేన అధినేత పవన్‌.. సిక్కోలు నుంచే YCP కోటలు బద్దలు కొడతామంటున్నారు. అధికారపార్టీని ఓడించడమే లక్ష్యం కావాలంటున్నారు పవన్‌. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాలను తెరమీదకు తీసుకొస్తున్నారు జనసేనాని. కొన్ని వర్గాల వల్ల నష్టపోతున్న వారికి అండగా ఉంటానంటూ ప్రకటించిన పవన్‌ ఉత్తరాంధ్రలో కూడా అదే ఎజెండాతో రాజకీయం మొదలుపెట్టారు. బలమైన సామాజిక వర్గం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా దాకా వచ్చిన బొత్స సత్యనారాయణ చివరకు సహాయమంత్రిగా మారారంటూ తనదైన శైలి కామెంట్ విసిరారు పవన్‌. అటు పొత్తులపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జనసేన బాస్‌. టీడీపీతో కలిసి ఉంటే అసెంబ్లీలోనే కూర్చుని మీ తాట తీసేవాళ్లమంటూ డైలాగ్‌ పేల్చారు పవన్‌. ఉత్తరాంధ్ర పర్యటనలో జనసేనాని పొలిటికల్‌ రూటు మారిందని ఆరోపిస్తోంది వైసీపీ. బీజేపీతో దోస్తీ.. టీడీపీతో రహస్య బంధం సాగిస్తున్నారన్నారంటోంది వైసీపీ. చంద్రబాబుకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుకొచ్చేది పవన్‌ కల్యాణ్ అంటున్నారు ఎంపీలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బానిసగా మారారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ నందిగం సురేష్‌.

మరోవైపు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం కోసం వచ్చిన పవన్‌ కల్యాణ్‌ కేంద్రాన్ని ప్రశ్నించకపోవడాన్ని వైసీపీ గుర్తుచేస్తోంది. బీజేపీని నిలదీసే ధైర్యం లేదా అని ప్రశ్నించారు మంత్రులు . ఉత్తరాంధ్రలో పవన్‌ మాట్లాడే మాటలు టీడీపీ నుంచి వచ్చిన స్క్రిప్టే అంటున్నారు. తాజాగా బద్వేలు ఎన్నికల్లో బీజేపీకి జనసేన, టీడీపీ సహకరించాయంటోంది వైసీపీ. అటు పవన్‌ వ్యాఖ్యలు.. ఇటు బైపోల్‌ నేపథ్యంలో పార్టీల మధ్య పొత్తు రాజకీయాలపై చర్చ మళ్లీ మొదలైంది. బీజేపీ మాత్రం జనసేనతోనే కలిసిసాగుతామంటోంది.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.

Also read:

India Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.. ఎప్పుడు జాయిన్ కానున్నాడో తెలుసా?

Accident: పండుగ పూట విషాదం.. ప‌టాకులు కొనేందుకు వెళ్లి నలుగురు దుర్మరణం..

AP Govt Employees: ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ రోజు కూడా సెలవే..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..