Dhanteras Business: ధన్‌తేరాస్ రోజు జోరందుకున్న బంగారం కొనుగోళ్లు.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!
Dhanteras Business: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. భారతీయ సాంప్రదాయంలో..
Dhanteras Business: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలకు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక నవంబర్ 2న ధన్‌తేరాస్ (ధన త్రయోదశి) జరిగింది. అయితే ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని ప్రజల విశ్వాసం. అందుకే ధన్‌తేరాస్ రోజు భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు రూ.75,000 కోట్ల బంగారం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 15 టన్నుల బంగారం అభరణాలు అమ్ముడుపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాపారాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు భారీగా జరిగినట్లు కాన్ఫెడరేన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తెలిపింది. ఇందులో ఢిల్లీలో సుమారు రూ.1000 కోట్లు, మహారాష్ట్రలో రూ.1,500 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు రూ.600 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అంచనా వేసింది సీఏఐటీ. దక్షిణ భారతదేశంలో దాదాపు రూ.2,000 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయని అంచనా వేసింది.
ధన్‌తేరాస్ సంర్భంగా ముఖ్యంగా బంగారం ఉత్పత్తులు ఊపందుకున్నాయి. ఆగస్టులో రికార్డు స్థాయిలో 10 గ్రాముల ధర రూ.57,000 వద్ద ఉంది. అయితే బంగారం ధర దంతేరాస్ 2020లో 10 గ్రాముల ధర రూ.39,240 ఉండేది. ఇప్పుడు ఈ ధర పరుగులు పెడుతోంది.
పెరిగిన కొనుగోళ్లు.. కాగా, ధన్‌తేరాస్ సందర్భంగా జ్యువెలరీ షాపులన్నీ రద్దీగా మారాయి. ఏడాది క్రితంతో పోలిస్తే దుకాణానికి వెళ్లి షాపింగ్ చేసే వినియోగదారుల సంఖ్య 40 శాతం పెరిగిందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ లోకల్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పేథే తెలిపారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా విక్రయాలు మందగించాయని, ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో వ్యాపారాలు జోరందుకున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వైరస్ సాధారణ స్థితికి చేరుకోవడం వల్లే జనాలు బయటకు వస్తున్నారని, దీని కారణంగా ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా జరిగినట్లు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి: