Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన సిల్వర్ ధర.. అక్కడ మాత్రం పరుగులు పెట్టింది!
Silver Price Today: వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. భారీగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి రోజు బంగారం..
Silver Price Today: వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. భారీగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి రోజు బంగారం, వెండి ధరలు బ్రేకులు వేయకుండానే పరుగులు పెడుతున్న ధరలు కాస్త వెనక్కి వెళ్లాయి. తాజాగా బంగారం కూడా భారీగాన తగ్గుముఖం పట్టగా, అదే దారిలో వెండి పయనిస్తోంది. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక గురువారం (నవంబర్ 4)న దేశీయంగా వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. ఇక దేశీయంగా పరిశీలిస్తే.. కిలో వెండిపై రూ.2వేలకుపైగా తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో కిలో వెండి రూ.1300 వరకు తగ్గింది. దీపావళి సీజన్‌లో బంగారం, వెండి ప్రియులకు అది మంచి శుభవార్త అనే చెప్పాలి. అయితే ఇంకో విషయం ఏంటంటో దేశ వ్యాప్తంగా వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడితే.. కేరళ రాష్ట్రంలో మాత్రం బ్రేకులు వేయకుండా పరుగులు పెట్టింది. అక్కడ కిలో వెండి ధరపై రూ.2900 వరకు ఎగబాకింది.ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి. ముఖ్య విషయం ఏంటంటే.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,400. ► చెన్నైలో కిలో వెండి ధర రూ.67,600. ► ముంబైలో కిలో వెండి రూ.62,400. ► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,400. ► బెంగళూరులో కిలో వెండి రూ.64,400. ► కేరళలో కిలో వెండి ధర రూ.67,600. ► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,600. ► విజయవాడలో రూ. 67,600 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి: