Petrol Diesel Price Today: కేంద్రం నిర్ణయంతో భారీగా తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో కొత్త రేట్లు!

Petrol Diesel Price Today: దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు కేంద్ర సర్కార్‌ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వరుసగా..

Petrol Diesel Price Today: కేంద్రం నిర్ణయంతో భారీగా తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో కొత్త రేట్లు!
Representative Image
Follow us

|

Updated on: Nov 04, 2021 | 5:15 AM

Petrol Diesel Price Today: దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు కేంద్ర సర్కార్‌ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను వినిపించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5, రూ.10 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకే బుధవారం నాడు కేంద్ర ఇంధన శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తగ్గించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా, వాహనదారులకు మరింత ఊరట కల్పించేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీపావళి పర్వదినం వేళ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో  పెట్రోల్‌ ధరలు..

► ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.04 ఉండగా, కేంద్రం నిర్ణయంతో రూ.105.04కు చేరుకోనుంది.

► ముంబైలో రూ.115.85 నుంచి రూ.110.85కు దిగిరానుంది.

► హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 114.49 ఉండగా, ప్రస్తుతం రూ.109.49కి దిగి రానుంది.

► నోయిడాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.20 ఉండగా, 102.20కి చేరుకోనుంది.

► లక్నోలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.96 ఉండగా, కేంద్ర నిర్ణయంతో రూ.101.96కు చేరుకోనుంది.

► కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.49 ఉండగా, ప్రస్తుతం రూ.105.49కి చేరుకోనుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో డిజీల్‌ ధరలు:

► ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.98.42 ఉండగా, రూ.88.42కి చేరుకోనుంది.

► ముంబైలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.106.62 ఉండగా, ప్రస్తుతం రూ.96.62కి దిగిరానుంది.

► హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 107.40 ఉండగా, ప్రస్తుతం రూ.97.40కు దిగి రానుంది.

► నోయిడాలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.91 ఉండగా, రూ.88.91కి చేరుకోనుంది.

► లక్నోలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.98జ91 ఉండగా, రూ.88.91కి చేరుకోనుంది.

► కోల్‌కతాలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.101.56 ఉండగా, ప్రస్తుతం రూ.91.56కి దిగిరానుంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పలు రాష్ట్రాలు కూడా దిగి వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ పై వ్యాట్‌ను రూ.7 వరకు తగ్గిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిస్వా శర్మ ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషానిచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయంతో తమ ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గివస్తున్నట్లు, దీంతో వాహనదారులకు మరింత మేలు జరగనుందని ఆయన అన్నారు. అలాగే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ కూడా నవంబర్‌ 4 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత తమ ప్రభుత్వం కూడా తగ్గిస్తున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జై రామ్‌ ఠాకూర్‌ చెప్పారు. గోవా, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, మణిపూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింతగా తగ్గనున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే కొన్ని పలు రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Onion Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌.. భారీగా తగ్గిన ఉల్లి ధర..!

Bank Loan: కస్టమర్లకు ఈ 9 బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ వడ్డీకే రుణాలు.. పూర్తి వివరాలు..!