PM Narendra Modi: ఎప్పటిలానే ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. ఈ సారి ఎక్కడంటే..?
PM Narendra Modi Diwali Celebrations: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. గతేడాది రాజస్థాన్‌లోని
PM Narendra Modi Diwali Celebrations: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. గతేడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి ప్రధాని మోదీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు మిఠాయిలు తినిపించి దీపాలు వెలిగించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా మోదీ సరిహద్దుల్లో పహారా కాస్తున్న వీర సైనికులతో పండుగను జరుపుకొని వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. అయితే.. ఈ సారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. గురువారం ఆయన నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2019లో ఆయన రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొని నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణం చేశారు.
ఇదిలా ఉంటే.. పూంచ్ ప్రాంతంలో గత 23 రోజులుగా భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో సిబ్బందిని భారీగా మోహరించారు. కాగా.. కాశ్మీర్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ కేదార్నాథ్ పర్యటనకు బయలు దేరనున్నారు.
Also Read: