- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2021: grand scale deepotsav celebrations in ayodhya
Ayodhya Diwali 2021: అయోధ్యలో అంబరాన్ని అంటుతున్న దీపావళి సంబరాలు.. ప్రపంచ రికార్డు సృష్టించిన భక్తజనం
Diwali 2021: దీపావళి వేడుకల్లో భాగంగా సరయూ నదీ తీరం దీపకాంతులతో మెరిసిపోయింది. రామజన్మ భూమి అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‌లోకి ప్రవేశించింది. ఈ వేడుకల్లో శ్రీలంక సంస్కృతి బృందం కూడా పాల్గొంది. రేపటి వరకూ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
Updated on: Nov 04, 2021 | 10:37 AM

దివ్వెల వెలుగులు, లేజర్ లైటింగ్‌తో సరయూతటి... అయోధ్యానగరి దీపావళి వేడుకకు ముస్తాబైంది. రామ జన్మభూమి అయోధ్యాపురి దీపాల కాంతులతో, లేజర్ లైట్స్ జిగేల్‌మని మెరిసిపోతోంది. దీపావళి పండగ సందర్భంగా దివ్వెల వెలుగుల్లో కాంతులీనుతోంది. అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డును సృష్టించింది.

గతేడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును బ్రేక్ ను చేసింది. బుధవారం సాయంత్రం సరయూ నది ఒడ్డున రామ్‌కీ ఫైడి ఘాట్‌లో 9లక్షల దీపాలను వెలిగించి సరికొత్త చరిత్రను సృష్టించింది.

దీపావళికి ఒకరోజు ముందు దీపోత్సవాన్ని యూపీ సర్కార్ నిర్వహించింది. రంగురంగుల రంగవల్లులు, విద్యుత్ దీపాలు, లేజర్ షోలు, లక్షలాది ప్రమిదలతో అయోధ్య దగదగలాడింది. ఇంద్ర ధనస్సులోని రంగుల కలబోతతో రామమందిరం అందంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని అయోధ్యలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. రామ మందిరంతో పాటు నగర చరిత్రతో పాటు, మన సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

సరయూ నదీ తీరంలో 9 లక్షల దీపాలతో పాటు అయోధ్య పట్టణం అంతా దీపాలను వెలిగించారు. మొత్తం 12లక్షల మట్టిదీపాలు అయోధ్యాపురికి అందాన్ని చేకూర్చాయి.

అయోధ్యతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.

అత్యంత వైభవంగా జరిగిన ఈ దీపోత్సవం కార్యక్రమంలో అయోధ్య సహా యూపీ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

దీపోత్సవం సందర్భంగా నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. మొత్తం 12వేల మంది వలంటీర్లు పనిచేశారు.

యూపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది యోగి సర్కార్.

మరోవైపు రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫేజ్-1 నిర్మాణ పనులు పూర్తవగా..ఫేజ్-2 పనులు కూడా చివరిదశకు చేరాయి.

2023 డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కానుంది.

అత్యంత వైభవంగా జరిగిన ఈ దీపోత్సవం కార్యక్రమంలో అయోధ్య సహా యూపీ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





























