Yogini Ekadashi 2025: వ్యాధుల నుంచి ఉపశమనం కోసం.. యోగినీ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి..
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం కృష్ణ పక్ష ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. యోగిని ఏకాదశి రోజున సులభమైన నివారణను పాటించడం ద్వారా మీరు తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆషాడ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. హిందువుల విశ్వాసం ప్రకారం, యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. హిందూ మత గ్రంథాలలో యోగిని ఏకాదశి వ్యాధులను నయం చేయడానికి అత్యంత పవిత్రమైన రోజుగా చెప్పబడింది. యోగిని ఏకాదశి రోజున సులభమైన నివారణను పాటించడం ద్వారా మీరు తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాలను వదిలించుకోవచ్చు.
2025 లో యోగిని ఏకాదశి ఎప్పుడు?
2025 సంవత్సరంలో జూన్ 21వ తేదీ, శనివారం రోజున యోగిని ఏకాదశి ఉపవాసం పాటించబడుతుంది. జేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి జూన్ 21న ఉదయం 7:18 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో, ఈ తిథి జూన్ 22న ఉదయం 4:27 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ఆధారంగా జూన్ 21న యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం ఉత్తమం.
యోగిని ఏకాదశి నాడు అన్ని పాపాలనుండి విముక్తి పొందే మార్గం
యోగిని ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ మహా విష్ణువుతో పాటు తులసి మాతని పూజించడం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. యోగిని ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. తరువాత విష్ణువు , తులసి మాతను పూజించండి. దీని తరువాత తులసి మొక్కకి నీరు సమర్పించి. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి.
ధూపం వేసి.. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి. దీనితో పాటు తులసి మొక్కకి ఏడుసార్లు ప్రదక్షిణ చేసి హారతిని ఇవ్వండి. మీరు యోగిని ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని ప్రయత్నిస్తే, శ్రీ మహా విష్ణువు సంతోషించి.. మీరు తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాడు.
ఈ రోజున విష్ణువుకు సమర్పించే నైవేద్యాలలో తులసి దళాలను జోడించడం మర్చిపోవద్దు. తులసి దళం లేని నైవేద్యాలను శ్రీ మహా విష్ణువు అంగీకరించడని హిందువుల విశ్వాసం. మీరు కోరుకుంటే యోగిని ఏకాదశి రోజున తులసి పూసలను ఉపయోగించి తులసి మాత మంత్రాన్ని జపించవచ్చు. మరోవైపు ఇంట్లో తులసి మొక్క లేకపోతే.. ఏకాదశి రోజున తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








