AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyeshta Amavasya 2025: ఇంట్లో డబ్బులకు ఇబ్బందులా.. జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయండి..

జ్యోతిష్య శాస్త్రంలో జ్యేష్ఠ మాసం అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయాలని చెప్పబడింది. వీటిని చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చు. ఆర్ధిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వారు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడం ఫలవంతం. కనుక ఈ రోజు జ్యేష్ఠ మాసం అమావాస్య రోజున ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..

Jyeshta Amavasya 2025: ఇంట్లో డబ్బులకు ఇబ్బందులా.. జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయండి..
Jyeshta Amavasya 2024
Surya Kala
|

Updated on: Jun 18, 2025 | 7:36 AM

Share

హిందూ మతంలో అమావాస్య తిథిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం జరుగుతోంది. ఈ నెల చివరి రోజు అంటే అమావాస్య తిథి జూన్ 25న వచ్చింది. అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేసినప్పటికీ.. ఈ రోజు సంపద దేవత అయిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఆషాఢ అమావాస్య రోజున కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పబడింది. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఎవరైనా సంపద దేవత ఆశీస్సులను పొందాలనుకుంటే.. జేష్ఠ అమావాస్య తిథి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

నెయ్యి దీపం వెలిగించండి జ్యేష్ఠ అమావాస్య తిథి ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి.. ఈ దీపంలో 7 లవంగాలను కూడా ఉంచవచ్చు. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి నెలకొంటాయని మత విశ్వాసం. అలాగే లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి.

తులసి జపమాల తో మంత్రాలు జపించడం జ్యేష్ఠ అమావాస్య తిథి తులసి పూసలతో గాయత్రీ మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున తులసి పూసలతో 108 సార్లు మంత్రాన్ని జపించండి. ఇది మానసిక ప్రశాంతత, శ్రేయస్సును తెస్తుందని మత విశ్వాసం. దీనితో పాటు లక్ష్మీ దేవి కూడా మీ పట్ల ప్రసన్నురాలవుతుంది.

ఇవి కూడా చదవండి

కుంకుమపువ్వు, లవంగాల నివారణ జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున కుంకుమపువ్వు, లవంగాలను కర్పూరంతో కలిపి వెలిగించండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని మత విశ్వాసం. అలాగే ఈ పరిహారం లక్ష్మీ దేవిని ఆకర్షిస్తుంది. ఎవరైనా జ్యేష్ఠ అమావాస్య తిథి ఈ పరిహారం చేస్తే ఇంట్లో సంపద ఉంటుంది.

స్నానం, నైవేద్యాలు జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఒక పవిత్ర నదిలో స్నానం చేయండి. ఇలా చేయడం సాధ్యం కాకపోతే స్నానపు నీటిలో గంగాజలం కలపండి. దీని తరువాత అభిజీత్ ముహూర్తంలో దక్షిణం వైపు ముఖంగా మీ పూర్వీకులకు అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది. పితృ దోషం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది.

రావి చెట్టుకి పూజ హిందూ మత విశ్వాసాల ప్రకారం రావి చెట్టు పూర్వీకులకు అత్యంత ప్రియమైనది. అటువంటి పరిస్థితిలో జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున రావి చెట్టును పూజించండి. అలాగే రావి చెట్టు మూలంలో పాలు, చక్కెర మిఠాయి కలిపిన నీటిని అందించండి. దీని తరువాత రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారం పిత్ర దోషాన్ని తొలగిస్తుంది.

పిండ ప్రధానం, తర్పణం పూర్వీకుల ఆత్మల శాంతి కోసం జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున పిండ ప్రధానం, తర్పణం అందించడం అవసరం. ఈ పని కోసం మీరు పండితుడి సహాయం తీసుకోవచ్చు. పూర్వీకుల తర్పణం కోసం నువ్వులు, కుశ, నీరు, పువ్వులు మొదలైనవి ఉపయోగించండి. దీని తరువాత పూర్వీకుల పేరు మీద పిండ ప్రధానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..