Lord Ganesh Puja: వ్యాపారం, కెరీర్‌లో ఇబ్బందులా.. బుధవారం ఈ పరిహారాలు చేయండి.. గణపయ్య అనుగ్రహం మీ సొంతం..
హిందూ మతంలో బుధవారం విఘ్నాలకధిపతి వినాయకుడికి , నవ గ్రహాల్లో ఒకటైన బుధుడికి అంకితం చేయబడింది. బుధవారం వ్యాపారవేత్తలకు ఫలవంతమైన రోజు. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. కెరీర్ పురోగతి కోసం గణేశుడికి దూర్వాను సమర్పించి ప్రసాదంగా మోదకాన్ని సమర్పించండి. ఇలా చేయడం వలన త్వరలో ప్రయోజనాలను తెస్తుంది.

ఎవరైనా ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా.. లేదా వ్యాపార రంగంలో పుంజుకోకపోతున్నా.. ఎంత కష్టపడి పనిచేసినా అందుకు తగిన గణనీయమైన ప్రయోజనం లభించకపోతే.. బుధవారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు. బుధవారం రోజు ముఖ్యంగా వ్యాపారవేత్తలకు చాలా ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది. అయితే.. ఈ పరిహారాలు చేయడం ద్వారా.. పని చేసే నిపుణులు కూడా ప్రయోజనాలను పొందుతారు. గణేశుడిని పూజించడం వల్ల విజయం లభిస్తుంది. అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. కెరీర్ కూడా తిరిగి ట్రాక్‌లోకి రావడం ప్రారంభమవుతుంది.
కెరీర్ సెట్ అవ్వకపోయినా… లేదా వ్యాపారంలో పురోగతి సాధించకపోయినా.. బుధవారం రోజున గణేశుని పాదాల వద్ద దర్భగడ్డితో పాటు జమ్మి ఆకులు సమర్పించడం వల్ల పనిలో పురోగతి లభిస్తుంది. బుధవారం గణేశునికి కుడుములు, ఉండ్రాళ్ళు నివేదన చేయడం ఫలవంతం.
గణేశుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కనుక గణపయ్య అనుగ్రహం కోసం ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయండి. పేద వ్యక్తికి పచ్చి శనగలు లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయడం వల్ల కెరీర్‌లో ప్రయోజనాలు లభిస్తాయి. ఆవుకు పచ్చి గడ్డిని ఆహారంగా అందించడం వలన కూడా ప్రయోజనకరం.
బుధవారం ఆకుపచ్చని దుస్తులు ధరించడం వల్ల బుధ గ్రహం బలపడుతుంది. అంతేకాదు ఇంటి అడబడుచుకు అంటే కుమార్తె లేదా సోదరికి బహుమతులు ఇవ్వడం వల్ల కెరీర్‌లో పురోగతి లభిస్తుంది.
బుధవారం ఈ మంత్రాలను జపించడం వల్ల మీకు మంచి జరుగుతుంది
1. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ । నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
2. గణపూజ్యో వక్రతుండ ఏకాదష్ట్రీ త్రయంబక:. నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్రరాజక:. ధూమ్రవర్ణోన్ భాలచంద్రో దశమస్తు వినాయకః. గణపర్తిహస్తిముఖో ద్వాదశారే యజేద్గణమ్ ॥
गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:। नीलग्रीवो लम्बोदरो विकटो विघ्रराजक :।। धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:। गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम।।
3. త్రయీమయాయ ఖిల్ బుద్ధిదాత్రే బుద్ధి ప్రదీపాయ పురాధిపాయ. నిత్యాయ సత్యాయ చ నిత్యబుద్ధి నిత్యం నిరీహం నమోస్తు నిత్యమ్.
त्रयीमयायाखिलबुद्धिदात्रे बुद्धिप्रदीपाय सुराधिपाय। नित्याय सत्याय च नित्यबुद्धि नित्यं निरीहाय नमोस्तु नित्यम्।
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








