Spiritual: ఇంటికి నల్ల పిల్లి వస్తుందా.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?

జ్యోతిష్య శాస్త్రంలో అతి చిన్న విషయాల గురించి కూడా చెప్పబడుతుంది. అలాగే వివిధ జంతువుల గురించి కూడా చెప్పబడింది. సాధారణంగా అందరి ఇళ్లలోకి వచ్చే వాటిల్లో పిల్లి కూడా ఒకటి. ఇంట్లోకి పిల్లుల రాక కొన్ని సంకేతలను చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వస్తేనే.. అశుభం అని భావించి.. ఆగి వెళ్తారు. అదే నల్ల పిల్లి ఎదురైతే మాత్రం.. ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తారు. సాధారణ పిల్లుల కంటే.. నల్ల పిల్లిని చూస్తే అందరూ భయ పడిపోతూ..

Spiritual: ఇంటికి నల్ల పిల్లి వస్తుందా.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?
Spiritual Tips
Follow us
Chinni Enni

|

Updated on: Feb 21, 2024 | 5:43 PM

జ్యోతిష్య శాస్త్రంలో అతి చిన్న విషయాల గురించి కూడా చెప్పబడుతుంది. అలాగే వివిధ జంతువుల గురించి కూడా చెప్పబడింది. సాధారణంగా అందరి ఇళ్లలోకి వచ్చే వాటిల్లో పిల్లి కూడా ఒకటి. ఇంట్లోకి పిల్లుల రాక కొన్ని సంకేతలను చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వస్తేనే.. అశుభం అని భావించి.. ఆగి వెళ్తారు. అదే నల్ల పిల్లి ఎదురైతే మాత్రం.. ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తారు. సాధారణ పిల్లుల కంటే.. నల్ల పిల్లిని చూస్తే అందరూ భయ పడిపోతూ ఉంటారు. ఇది ఎదురు పడితే నష్టం జరుగుతుందని నమ్ముతారు. నల్ల పిల్లి కనిపించడమే అశుభంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోకి నల్ల పిల్లి వస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అస్సలు మంచిది కాదు.

నల్ల పిల్లులు ఎన్నో ముఖ్యమైన విషయాలకు ప్రతీకలు. ఈ పిల్లులు పూర్వీకులతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. నారద పురాణ ప్రకారం.. నల్ల పిల్లి తరచూ ఇంట్లోకి వస్తే.. అస్సలు మంచిది కాదట. ఇంట్లో ఏదైనా అశుభం జరుగుతుందని భావించాలి.

పేదరికం అనుభవిస్తారు..

నల్ల పిల్లి ఇంట్లోకి వస్తే పేదరికానికి సంకేతంగా భావిస్తారు. నల్ల పిల్లి ఇంట్లోకి వచ్చిందంటే.. పేదరికం వస్తుందని భయ పడతారు. అలాగే దుష్ట శక్తుల రకకు చిహ్నంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

డబ్బు నష్టం..

నల్ల పిల్లి మీ వంట గదిలోకి వెళ్లి పాలు తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుందట. అలాగే మీ ఇంట్లో పదే పదే అశుభ సంఘటనలు కూడా జరుతాయి. ఇంట్లో నెగిటివ్ వాతావరణం నెలకొంటుంది.

జీవితంలో సంక్షోభం..

ఇంట్లోకి నల్ల పిల్లి తరచూ వస్తుందంటే.. జీవితంలో అనుకోని సంక్షోభాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. నల్ల పిల్లి మిమ్మల్ని తాకడం లేదా దాడి చేస్తే.. అనుకోకుండా మీరు భారీ నష్టాన్ని పొందాల్సి ఉంటుంది.

దుష్ట శక్తులకు చిహ్నం:

ఇంట్లోకి నల్ల పిల్లి రావడం అస్సలు మంచిది కాదు. ఒక వేళ వచ్చిందంటే.. మీ ఇంట్లో ఏవో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం. ఇది నెగిటీవ్ ఎనర్జీకి సంకేతంగా భావించవచ్చు. పిల్లుల రాకతో ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని కూడా నమ్ముతారు.