Kasinayana Kshetra: ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రానికి అటవీ శాఖ నోటీసులు

అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్త జనానికి తెలియని చోటేమీ కాదు. రోజులో ఏ సమయంలో అవధూత కాశి నాయన సత్రానికి వెళ్లినా, అక్కడ నిత్యం అన్నదానం ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే! చాలామంది అనాథలకు కాశీనాయన సత్రం ఒక దేవాలయం. నల్లమల అడవులలో ఉన్న ఈ సత్రానికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.

Kasinayana Kshetra: ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రానికి అటవీ శాఖ నోటీసులు
Avadhuth Kasinayana Mandir
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Feb 21, 2024 | 8:04 PM

అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్త జనానికి తెలియని చోటేమీ కాదు. రోజులో ఏ సమయంలో అవధూత కాశి నాయన సత్రానికి వెళ్లినా, అక్కడ నిత్యం అన్నదానం ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే! చాలామంది అనాథలకు కాశీనాయన సత్రం ఒక దేవాలయం. నల్లమల అడవులలో ఉన్న ఈ సత్రానికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైగక్ జోన్ లో ఉన్న దేవాలయం ఖాళీ చేయాలంటూ అటవీ శాఖ అధికారులు హుకుం జారీ చేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో గల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అవధూత కాశి నాయన సత్రం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సేవలు కొనసాగుతున్నాయి. అలాగే ఆయన తపస్సు చేసిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎండోమెంట్‌లోకి వెళ్ళింది. అయితే తాజాగా దేవాలయానికి ఎటువంటి నోటీసులు ఇవ్వకపోయినా కాశీనాయన సత్రానికి ఆయన సమాధి తరలించాంటూ అటవీశాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. దాదాపు 25ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయం టైగర్ జోన్ పరిధిలో ఉందంటూ తాజా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అటవీ అధికారులు.

1995 సంవత్సరం డిసెంబర్ నెలలో సమాధి స్థితికి చేరుతానని, తన శిష్యులతో ముందుగానే చెప్పారు కాశిరెడ్డి నాయన. తన మరణాంతరం తన తపస్సు చేసిన ప్రాంతంలోనే సమాధి చేయాలని సూచించారు. తదనంతరం ఈ ప్రాంతం జ్యోతి క్షేత్రంగా ప్రజ్వరిల్లుతుందని ఆయన శిష్యులతో చెప్పారు. 1995 గుడి మొదలు అయినప్పటి నుంచి అప్పటి నాయకులు అధికారులు అండదండలతో గుడి అభివృద్ధి చెందుతూ వచ్చింది. గుడి డెవలప్ చెందుతూ వివిధ భవనాలు ఏర్పడడంతో, గిట్టనివారు పిటిషన్ వేయడంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతం టైగర్ జోన్ పరిధిలో ఉందని, వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. సత్రానికి సంబంధించిన విషయం తెలుసుకున్న పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అధికారులకు నచ్చ చెప్పారు. అటవీ భూమి క్షేత్రానికి ఎంత తీసుకున్నారో అంతకు రెండింతలు ఫారెస్ట్ అధికారులకు ప్రైవేటు భూమి అప్ప జెప్పాలని రాజీ చేసుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబునల్ నుండి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించమని నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు వెళ్ళిన అధికారులను స్థానిక గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున అడ్డుకుని ఆందోళనకు దిగారు. భక్తుల మనోభావాలు క్షేత్రం పవిత్రత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సమయం ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చూస్తామని సమయం కావాలని చెప్పడంతో అధికారులు వెనుతిరి గారు. జ్యోతి క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అదేగాక ఆయన సమాధి స్థితికి చేరిన రోజు గుడి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆరోజు లక్షల మంది భక్తులు కాశినాయన క్షేత్రాన్ని దర్శించుకుంటారు.

కాశినాయన క్షేత్రం అంతా కూడా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో ఈ ప్రాంతమంతా టైగర్ జోన్ లో ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలోని బద్వేలు పోరుమామిళ్ల కాసినాయన సిద్ధవటం వరకు ఉన్న అటవీ ప్రాంతమంతా టైగర్ జోన్ ఏరియా అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తుండడంతో ఎటువంటి అపాయం జరగకుండా ఉండేందుకే సత్రాన్ని ఖాళీ చేయాలని సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఏది ఏమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిత్యం వేలాది మంది భక్తులకు అన్నదానాన్ని ప్రసాదిస్తూ భక్తిపారవశ్యంతో ఉన్న ఈ కాశీనాయన సత్రాన్ని ఇక్కడి నుంచి తరలించవద్దని భక్తులు వేడుకుంటున్నారు. అయితే సెక్యూరిటీ రీసన్స్ రీత్యా చూసుకుంటే అటవీశాఖ అధికారులు చెప్పిన దానినిబట్టి ఇది టైగర్ జోన్ లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ నుంచి దేవాలయాన్ని తరలించాలని అంటున్నారు. లేదంటే గుడి చుట్టూ సెక్యూరిటీ పరంగా తగు చర్యలు తీసుకుని ఇక్కడే ఉంచే దానికోసం ప్రయత్న ఏర్పాట్లు చేస్తే బాగుంటుందంటున్నారు భక్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…