Medaram: మేడారం జాతరలో ఆరోగ్యశాఖ అలర్ట్, భక్తుల కోసం కీలక సూచనలు
మేడారం జాతర.. అసియాలోనే అతిపెద్ద ఉత్సవ వేడుక. ఆ జాతర కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఆదివాసీ కుంభమేళాను సందర్శించే భక్తుల కోసం తెలంగాణ ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ బి.రవీందర్ నాయక్ మార్గదర్శకాలు జారీ చేశారు.
మేడారం జాతర.. అసియాలోనే అతిపెద్ద ఉత్సవ వేడుక. ఆ జాతర కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఆదివాసీ కుంభమేళాను సందర్శించే భక్తుల కోసం తెలంగాణ ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ బి.రవీందర్ నాయక్ మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజారోగ్య సన్నద్ధతలో భాగంగా మేడారం పరిసర ప్రాంతాల్లో 150 మంది వైద్యులతో 72 వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలతో పాటు అవాంఛనీయ సంఘటనలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని, భక్తులకు చేయాల్సినవి, చేయకూడనివి కూడా జారీ చేశామని తెలిపారు.
జాతర సమయంలో వాతావరణం వేడి, ఉక్కపోత ఉంటుందని భక్తులు పుష్కలంగా జ్యూస్ లాంటివి తాగాలని వైద్యులు సూచించారు. ‘హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. దాహంగా అనిపించకపోయినా పళ్ల రసాలు లాంటివి తీసుకోవాలి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం, ముఖ్యంగా దగ్గినా, తుమ్మినా తర్వాత, మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత, ఆహారం తీసుకునేముందు, జంతువులను తాకిన తర్వాత వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అంతేకాదు.. క్లోరినేటెడ్ నీటిని మాత్రమే తాగాలి అనే తెలిపారు.
భక్తులు అన్నివేళలా మాస్కులు ధరించాలని, వండిన ఆహారం చాలా ఫ్రెష్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘తినడానికి ముందు అన్ని పండ్లు, కూరగాయలను జాగ్రత్తగా కడగాలి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, విరేచనాలు, కడుపునొప్పి వంటి లాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి రిపోర్ట్ చేయండి. 108 అంబులెన్స్ సేవలను ఉపయోగించండి. ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆరోగ్య సేవలను పోందాలి. భక్తులు మద్యం, ఇతర మాదకద్రవ్యాలు తీసుకోవద్దు. వీధి ఆహారం, పండ్లు, కూరగాయలు తినొద్దని సూచించారు. మాంసం ఉత్పత్తులను తినడం మానుకోవాలని తెలిపారు.