AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణీ స్త్రీలను పాములు ఎందుకు కాటేయ్యవు.. పురాణాలలో దాగున్న రహస్యం ఏమిటంటే..

పాముకి సహజమైన ఇంద్రియాలు ఉన్నాయి. అవి స్త్రీ గర్భవతిగా ఉందో లేదో సులభంగా గుర్తించగలవు. గర్భం దాల్చిన మహిళల్లో పాములు సులభంగా గుర్తించగల కొన్ని మూలకాలు స్త్రీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వాటిని గుర్తించే గుణం పాములకు ఉంటుందని నమ్మకం. అయినప్పటికీ గర్భిణీ స్త్రీని పాములు కాటు వేయకపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు హిందూ పురాణాలలో ఉన్న సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం..

గర్భిణీ స్త్రీలను పాములు ఎందుకు కాటేయ్యవు.. పురాణాలలో దాగున్న రహస్యం ఏమిటంటే..
Pregnancy And Snake MythsImage Credit source: Pinterest
Surya Kala
|

Updated on: Jun 18, 2024 | 7:06 PM

Share

హిందూ మతంలో పామును దైవంగా భావించి పూజిస్తారు. శివునికి ఇష్టమైన ఆభరణం… విష్ణువుకి తల్పం కూడా పాములే.. పాములకు సంబంధించిన అనేక నమ్మకాలు హిందువులకు ఉన్నాయి. ముఖ్యంగా నాగ పాము దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. పాములు గర్భిణీ స్త్రీని ఎప్పుడూ కాటేవని ఓ నమ్మకం. అంతేకాదు గర్భిణీ స్త్రీ దగ్గరకు వెళ్ళిన పాములకు కళ్ళు కనిపించవని.. అప్పుడు వాటికి దారి కనిపించదని చెబుతారు. అయితే పాముల విషయంలో ఇవి ఎందుకు జరుగుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మన పురాణాలలో దాగి ఉన్న విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

గర్భిణీ స్త్రీలను పాములు ఎందుకు కాటు వేయవంటే?

పాముకి సహజమైన ఇంద్రియాలు ఉన్నాయి. అవి స్త్రీ గర్భవతిగా ఉందో లేదో సులభంగా గుర్తించగలవు. గర్భం దాల్చిన మహిళల్లో పాములు సులభంగా గుర్తించగల కొన్ని మూలకాలు స్త్రీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వాటిని గుర్తించే గుణం పాములకు ఉంటుందని నమ్మకం. అయినప్పటికీ గర్భిణీ స్త్రీని పాములు కాటు వేయకపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు హిందూ పురాణాలలో ఉన్న సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం..

పురాణాలలో దాగి ఉన్న సమాధానం

బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ ప్రకారం.. ఒక గర్భవతి శివుని ఆలయంలో తపస్సు చేస్తోంది. ఆమె తపస్సులో పూర్తిగా మునిగిపోయింది. ఆ సమయంలో రెండు పాములు ఆలయంలోకి వచ్చి గర్భిణిని వేధించడం ప్రారంభించడంతో ఆ మహిళ తపస్సు భంగం కలిగింది. తనను వేధిస్తున్న పాములను ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. మహిళ తపస్సు భగ్నం అవ్వడంతో ఆ స్త్రీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈరోజు నుంచి గర్భిణి దగ్గరికి సర్పాలు వెళ్లితే అంధులవుతాయని సర్ప జాతి మొత్తాన్ని శపించాడు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీని చూడగానే పాములు గుడ్డిగా మారతాయనీ, గర్భిణిని కాటేయవు అనే నమ్మకం ప్రాచుర్యంలోకి వచ్చింది. కథ ప్రకారం గర్భిణీ స్త్రీకి జన్మించిన శిశివు గోగా జీ దేవ్, శ్రీ తేజా జీ దేవ్, జహర్వీర్ పేర్లతో ప్రసిద్ధి చెందాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయాలను గుర్తుంచుకోండి

హిందూ మతంలో నాగు పామును చంపడం మహాపాపం కిందకు వస్తుంది. సర్పాన్ని చంపిన వ్యక్తీ తన జీవితంలో అనేక దుష్ప్రభావాలను అనుభవించవలసి ఉంటుందని.. గర్భిణీ స్త్రీ పాములను చంపకూడదని నమ్ముతారు. అయితే పురాణాల నమ్మి పాము దగ్గరికి వెళ్లడం వల్ల గర్భిణీ స్త్రీకి, శిశువుకు తెలిసి లేదా తెలియక హాని జరుగుతుంది. గర్భిణీ స్త్రీ చుట్టూ పాము కనిపిస్తే.. వెంటనే అప్రమత్తంగా ఉండాల్సిందే..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.