Viral Video: గబ్బిలం సూప్‌ని తయారు చేసి పిల్లలకు ఇచ్చిన మహిళ.. కరోనా నుంచి ఏమి నేర్చుకోలేదంటూ నెటిజన్లు మండిపాటు..
గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో చైనీయుల ఆహారపు అలవాట్ల మీద రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది కూడా.. ఇక ఈ కరోనా వైరస్ కారణంగా లక్షల మంది మరణించారు. ఇప్పుడు గబ్బిలాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ గబ్బిలాల పులుసును తయారు చేయడంతో పాటు దాని మాంసాన్ని తన పిల్లలకు కూడా తినడానికి ఇస్తుంది.
2020-21 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పుడు.. దీని గురించి వివిధ వాదనలు వినిపించాయి. ఈ వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే కారణమని.. ఈ వైరస్ మొదట చైనాలో వ్యాపించిందని.. అక్కడ ప్రజలు గబ్బిలాల మాంసాన్ని కూడా తింటారని.. అలా గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో చైనీయుల ఆహారపు అలవాట్ల మీద రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది కూడా.. ఇక ఈ కరోనా వైరస్ కారణంగా లక్షల మంది మరణించారు. ఇప్పుడు గబ్బిలాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ గబ్బిలాల పులుసును తయారు చేయడంతో పాటు దాని మాంసాన్ని తన పిల్లలకు కూడా తినడానికి ఇస్తుంది.
ఆ మహిళ చనిపోయిన గబ్బిలాన్ని తీసుకుని దానిని చిన్న ముక్కలుగా కోసినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీని తర్వాత ఆమె సూప్ చేయడం ప్రారంభించి.. ఆపై ఆ గబ్బిలాల సూప్ ని రుచి చూసి, సూప్ ఎలా ఉందో చెబుతుంది, అయితే దీని తర్వాత కనిపించే దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి ఆ మహిళ తన పిల్లలకు తినడానికి గబ్బిల మాంసాన్ని ఇచ్చింది. పిల్లలు కూడా గబ్బిలం మాంసాన్ని చాలా ఇష్టంగా తినడాన్ని ఆస్వాదిస్తూ తినడం మొదలు పెట్టారు. ఇలాంటి దృశ్యాన్ని ఎవరైనా సరే చాలా అరుదుగా చూసి ఉంటారు. ఈ వీడియో ప్రజల మనోభావాలను దెబ్బతీసింది.
వీడియో చూడండి
View this post on Instagram
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో emak_pangeran అనే IDలో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 1.9 మిలియన్లు అంటే 19 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకోగా.. 20 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు.
అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు ‘ప్రకృతిలో దొరికేది ప్రతిదీ తినడం కోసమే కాదు అని అంటే.. చాలా మంది వినియోగదారులు ‘ఈ వ్యక్తులు కోవిడ్ నుంచి ఏమీ నేర్చుకోలేదని తెలుస్తోంది’ అని కామెంట్ చేశారు. అదేవిధంగా ఇలాంటి చూస్తుంటే మళ్ళీ కరోనా తిరిగి వస్తుందని అనిపిస్తుంది’ అని తమ భయాన్ని వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..