AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎస్కలేటర్‌లో ఇరుక్కున్న బాలిక కాలు .. వెంటనే స్పందించిన జోకర్.. షాకింగ్ వీడియో వైరల్

నిజానికి ఒక చిన్న అమ్మాయి తన కుటుంబంతో కలిసి మాల్‌కి వెళ్లి అక్కడి ఎస్కలేటర్‌లో దిగుతోంది. ఈ సమయంలో ఆమె ఎస్కలేటర్ ఎక్కుతూ సరదాగా గడుపుతుంది. అయితే అకస్మాత్తుగా ఆమె పాదం ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. అప్పుడు గందరగోళం ఏర్పడింది. బాలిక తల్లి ఎస్కలేటర్‌లో నుంచి కాలు బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అటువంటి పరిస్థితిలో మాల్‌లో జోకర్ గా పనిచేసే ఉద్యోగి వేగంగా స్పందించాడు.

Viral Video:  ఎస్కలేటర్‌లో ఇరుక్కున్న బాలిక కాలు .. వెంటనే స్పందించిన జోకర్.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Jun 19, 2024 | 1:48 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ద భవనాలు లేదా మాల్స్ మొదలైన వాటిలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉండటం సర్వసాధారణం. భవనాలు చాలా ఎత్తుగా ఉంటే.. సాధారణంగా అక్కడ లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. అయితే మాల్స్ లేదా రైల్వే స్టేషన్లు లేదా మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ అవి ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో.. అదే సమయంలో అవి అత్యంత ప్రమాదకరమైనవి. పొరపాటున చేతులు లేదా కాళ్ళు ఇరుక్కుపోతే.. అప్పుడు కలిగే ప్రమాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో జనం ఉలిక్కిపడ్డారు.

నిజానికి ఒక చిన్న అమ్మాయి తన కుటుంబంతో కలిసి మాల్‌కి వెళ్లి అక్కడి ఎస్కలేటర్‌లో దిగుతోంది. ఈ సమయంలో ఆమె ఎస్కలేటర్ ఎక్కుతూ సరదాగా గడుపుతుంది. అయితే అకస్మాత్తుగా ఆమె పాదం ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. అప్పుడు గందరగోళం ఏర్పడింది. బాలిక తల్లి ఎస్కలేటర్‌లో నుంచి కాలు బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అటువంటి పరిస్థితిలో మాల్‌లో జోకర్ గా పనిచేసే ఉద్యోగి వేగంగా స్పందించాడు.. గబగబా ఎస్కలేటర్‌ను ఆపాడు. ఆ తర్వాత మాల్‌లోని ఇతర ఉద్యోగులు కూడా అక్కడికి చేరుకుని.. చాలా ప్రయత్నం తర్వాత ఆ బాలిక కాలును లోపలి నుంచి బయటకు తీయడంలో విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో farhan.safdar.01 అనే IDతో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 2 మిలియన్లు లేదా 20 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఎస్కలేటర్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని రాశారు. అయితే కొంతమంది వినియోగదారులు త్వరగా వచ్చి ఎస్కలేటర్‌ను ఆపిన జోకర్‌ను ప్రశంసిస్తున్నారు. దీంతో ఆ బాలికకు పెద్దగా ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..