అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల 29నుంచి అనంత్, రాధిక పెళ్లి సందడి షురూ
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జూన్ 29న అంబానీల ముంబై నివాసం యాంటిలియాలో సన్నిహిత పూజ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. ఈ వివాహ వేడుకను భారీ స్థాయిలో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహ వేడుకలో వధూవరులు ధరించే దుస్తులు దగ్గర నుంచి స్టైల్ వరకూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫ్యాషన్ స్టైలిస్ట్‌లు రియా కపూర్ , షలీనా నథాని ఈ పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మేరకు సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లు వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల్లో ఓ రేంజ్ లో సాగాయి. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముఖేష్, నీతా అంబానీల చిన్న కుమారుడి అనంత్ , రాధికల వివాహ వేడుక సందడి మొదలు కానున్నాయి. ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి సంబరాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 29వ తేదీన సాంప్రదాయ పద్దతిలో పుజాదికార్యక్రమాలను నిర్వహించి పెళ్లి వేడుకలను మొదలు పెట్టనున్నట్లు కుటుంబ సన్నిహితులు చెప్పినట్లు నేషనల్ పత్రికల కథనం.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జూన్ 29న అంబానీల ముంబై నివాసం యాంటిలియాలో సన్నిహిత పూజ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. ఈ వివాహ వేడుకను భారీ స్థాయిలో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహ వేడుకలో వధూవరులు ధరించే దుస్తులు దగ్గర నుంచి స్టైల్ వరకూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫ్యాషన్ స్టైలిస్ట్‌లు రియా కపూర్ , షలీనా నథాని ఈ పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మేరకు సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికలు వధూవరులుగా ధరించే దుస్తులను ప్రముఖ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేస్తారని భావిస్తున్నారు.
ఈ నెల జూన్ 29న పూజతో వివాహ వేడుక ప్రారంభం కానుంది. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు వివాహ వేడుక జరగనుంది. జూలై 12న పెళ్లి జరగనుంది. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ ఉత్సవం లేదా వివాహ రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. జులై 14న జరగనున్న రిసెప్షన్ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ రోజుతో విలాసవంతమైన వివాహ వేడుక ముగుస్తుంది. అంబానీ కుటుంబం ఔన్నత్యాన్ని , ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ ఈ సంవత్సరంలో అత్యంత ఉన్నతమైన వివాహాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
2022లో అధికారికంగా అనంత్-రాధిక పెళ్లిని ప్రకటించింది. 2023 జనవరిలో ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అనంత్, రాధిక ఫిబ్రవరిలో జామ్‌నగర్‌లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఆ తర్వాత రెండవ ప్రీ-వెడ్డింగ్ బాష్ మే 29న ఇటలీలో ప్రారంభమై.. క్రూయిజ్‌లో జరిగిన ఈ వేడుక జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిసింది.
ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








