ఎండ వానల కలయిక.. విచిత్ర వాతావరణంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం..
ఈ సీజన్‌లో బయటి నుంచి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లోని నీళ్లు తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనితో పాటు, వేడి లేదా చల్లగా కలిసి తినడం కూడా హానికరం. అయితే ఈ సమస్యకు కొందరు మందులు తీసుకుంటే మరికొంత మంది ఇంటి చిట్కాలను నమ్ముతారు. మీరు కూడా ప్రస్తుతం జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి రిలీజ్ వస్తుంది.
ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు హఠాత్తుగా కురిసే వర్షం దీంతో ఎక్కువ మంది దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొంతమంది వేసవి కాలంలో కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే చలికాలంలో చల్లగా ఏదైనా తింటే, జలుబు, దగ్గు లేదా జ్వరంతో బాధపడతారు. అయితే ఈ సీజన్‌లో అనారోగ్య బారిన పడిన వ్యక్తిని కలిసినా ఎదుటివారి ఆరోగ్యం పాడు అవుతుంది. ఈ సీజన్ లో జలుబు, దగ్గు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.
వేసవి కాలంలో చాలా మంది ఏసీ గదుల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. అయితే ఎక్కువ సేపు ఏసీ రూమ్‌లో ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, దీని వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. ఈ సీజన్‌లో బయటి నుంచి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లోని నీళ్లు తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనితో పాటు, వేడి లేదా చల్లగా కలిసి తినడం కూడా హానికరం. అయితే ఈ సమస్యకు కొందరు మందులు తీసుకుంటే మరికొంత మంది ఇంటి చిట్కాలను నమ్ముతారు. మీరు కూడా ప్రస్తుతం జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి రిలీజ్ వస్తుంది.
తులసి కషాయం జలుబు విషయంలో తులసిని ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. తులసిలోని ఆయుర్వేద గుణాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి సురక్షితంగా ఉంచుతాయి. దీని కోసం ప్రతిరోజూ ఉదయం 4-5 తులసి ఆకులను కడిగి తినవచ్చు. అంతే కాదు మీరు తులసి టీని కూడా త్రాగవచ్చు లేదా తులసి దళాలను నీటిలో ఉడికించి త్రాగవచ్చు.
అతిమధురం జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి అతిమధురం దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా అతిమధురం పొడిని కలిపి త్రాగవచ్చు. ఇలా చేయడం వలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు అతిమధురం డికాక్షన్ కూడా తయారు చేసి త్రాగవచ్చు. డికాక్షన్ చేయడానికి పావు చెంచా జామపండు పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని తులసి దళం, చిటికెడు మిరియాల పొడి కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
తిప్పతీగ తిప్పతీగ అనేది జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించే ఒక రకమైన ఆయుర్వేద ఔషధం. తిప్పతీగ జ్యూస్ చేయడానికి 2 చెంచాల తిప్పతీగ జ్యూస్‌ని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఇలా చేయడం వలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..