- Telugu News Photo Gallery Nutmeg Helps To Enhance Sleep And To Boost Sperm Count Telugu Lifestyle News
Nutmeg Benefits: జాజికాయ మజాకా..! క్రమం తప్పకుండా వాడితే బోలేడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ పరార్..!
జాజికాయ కేవలం సుగంధ ద్రవ్యాల్లో భాగమైనదే కాదు. జాజికాయలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ జాజికాయ కీళ్ల నొప్పులను, కండరాల నొప్పులను తగ్గించడంతో పాటుగా వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది రాత్రిపూట హాయిగా నిద్రపట్టేందుకు కూడా సహాయపడుతుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోక మానరు.
Updated on: Jun 18, 2024 | 6:28 PM

జాజికాయ ఫైబర్ అద్భుతమైన మూలం. ఇందులో ఐరన్, జింక్, ఫాస్పరస్, కాపర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ మరియు మెగ్నీషియం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో జాజికాయను వాపు, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, పుండ్లకు చికిత్స ఔషధంగా ఉపయోగిస్తారు. ఉరుకుల పరుగుల జీవితంలో మనకున్న ఒత్తిడిని తగ్గించడంలో జాజికాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడిని కలుపుకుని తాగితే ప్రశాంతంగా, తొందరగా నిద్ర పడుతుంది.

జాజికాయ మీ మేధస్సుకు పదును పెట్టడమే కాకుండా మీ కళ్లకు పదును పెడుతుంది. జాజికాయ పొడిని పేస్టులా చేసి కనురెప్పలు, కళ్ల చుట్టూ రాసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. అంతేకాదు, జాజికాయను ఆహారంలో బాగంగా చేర్చుకునే వారికి మతిమరుపు అనే బాధ ఉండదు.

జాజికాయ మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది. నిరాశ, ఆందోళనలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమల నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనం చర్మానికి మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది.

జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ జాజికాయ క్యాన్సర్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది.జాజికాయతో పెద్దప్రేగు క్యాన్సర్ ను నివారించగలదని పలు పరిశోధనలు వెల్లడించాయి. అంతేకాదు, ఇది కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారాలు అవయవాలలో విషాన్ని పెంచుతాయి. అయితే జాజికాయ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే కాలేయం, మూత్రపిండాల నుంచి విషాన్ని తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగించడానికి ఇది సహాయపడుతుంది.




