- Telugu News Photo Gallery Do this to prevent mosquitoes from entering the house, check here is details in Telugu
Get Rid of Mosquitoes: దోమలు ఇంట్లోకి రాకూడదంటే ఇలా చేయండి..
కాలం ఏదైనా సరే.. ఇంట్లోకి పిలవకుండా అతిథులే దోమలు. ఇంట్లోని ఏదో ఒక మూల నుంచి వచ్చి ఎటాక్ చేస్తూనే ఉంటాయి. అసలే ఇప్పుడు వాతావరణం మారింది. అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. దీంతో దోమల బెడద మరింత ఎక్కువ అవుతుంది. వీటివల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్ర ఉండదు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు చెప్పలేక ఏడుస్తూ ఉంటారు. ఈ దోమ కాటుల వల్ల..
Updated on: Jun 18, 2024 | 3:41 PM

కాలం ఏదైనా సరే.. ఇంట్లోకి పిలవకుండా అతిథులే దోమలు. ఇంట్లోని ఏదో ఒక మూల నుంచి వచ్చి ఎటాక్ చేస్తూనే ఉంటాయి. అసలే ఇప్పుడు వాతావరణం మారింది. అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. దీంతో దోమల బెడద మరింత ఎక్కువ అవుతుంది.

వీటివల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్ర ఉండదు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు చెప్పలేక ఏడుస్తూ ఉంటారు. ఈ దోమ కాటుల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు రావచ్చు.

కాబట్టి దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఇంట్లోని తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి.. కర్పూరం పొగ వేయండి. ఇలా చేస్తే ఇంట్లో దోమలు ఉండవు. ఒక చిన్న గిన్నెలో నీళ్లు, కర్పూరం బిళ్లలు వేసి మీరు నిద్రించే గదిలో ఉంచండి. ఈ వాసనకు దోమలు పారిపోతాయి.

ఈ చిట్కా కూడా దోమలను బయటకు వెళ్లగొట్టేందుకు చక్కగా హెల్ప్ చేస్తుంది. లవంగాలను పొడిలా చేసుకుని.. అందులో నిమ్మ రసాన్ని, కొద్దిగా నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి.. కిటికీలు, తలుపులపై చేయండి. ఇలా చేయడం వల్ల దోమలు ఇంట్లోకి రావు.

mosquitoes




