Yoga Day 2024: ఈ యోగాసనం బరువు తగ్గించడంలో, అందాన్ని పెంచడంలో సహాయపడుతుంది..
మెడ, ముఖం చుట్టూ కొవ్వు కనిపించడం ప్రారంభిస్తే రకరకాల సమస్యలను కలిగిస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి మహిళలు అనేక రకాల ఫేషియల్ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ముఖం, శరీరం రెండింటినీ ఫిట్‌గా ఉంచడంలో మీకు సహాయపడే ఒక యోగా ఆసనం ఉంది. ఇది ముఖ కండరాలను సడలించడమే కాకుండా.. చెడు శరీర భంగిమను సరిచేయడంలో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
నేటి కాలంలో.. దిగజారుతున్న జీవనశైలి కారణంగా ఒక వ్యక్తి శారీరక, మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది వ్యక్తులు రోజంతా స్క్రీన్‌పై ఒకే చోట కూర్చొని పని చేస్తూ గడుపుతుంటారు. శారీరక శ్రమ చేసే అవసరం ఉండడం లేదు. దీని కారణంగా ఎక్కువ మంది ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. కనుక రోజు హడావిడి జీవితంతో కొంతమంది శారేరక సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
శారీరక, మానసిక సమస్యలు రెండూ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కొందరిలో విశ్వాసం తగ్గడం మొదలవుతుంది. ఉదాహరణకు మెడ, ముఖం చుట్టూ కొవ్వు కనిపించడం ప్రారంభిస్తే రకరకాల సమస్యలను కలిగిస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి మహిళలు అనేక రకాల ఫేషియల్ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ముఖం, శరీరం రెండింటినీ ఫిట్‌గా ఉంచడంలో మీకు సహాయపడే ఒక యోగా ఆసనం ఉంది. ఇది ముఖ కండరాలను సడలించడమే కాకుండా.. చెడు శరీర భంగిమను సరిచేయడంలో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
సింహాసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
సింహాసనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని యోగా నిపుణుడు సుగంధ గోయల్ చెప్పారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది, గొంతు, ముఖం కండరాలను సడలిస్తుంది. ముఖ కాంతిని పెంచుతుంది, వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. స్వర తంత్రులను మెరుగుపరుస్తుంది. ఆందోళన , నిరాశ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. నోటి దుర్వాసనను నివారించడంతోపాటు చెడు శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. అంతేకాదు సింహాసనం థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
సింహాసనం చేయడానికి సరైన మార్గం
ఈ సింహాసనం వేయడానికి ముందు నేలపై యోగా మ్యాట్‌ను పరచుకొండి. వజ్రాసన స్థితిలో కూర్చుని మోకాళ్లను కొంత దూరంగా పెట్టండి. రెండు పాదాల వేళ్లు ఒకదానికొకటి తాకే విధంగా చూడండి. తర్వాత ముందుకు వంగి రెండు అరచేతులను మోకాళ్ల మధ్య నేలపై ఉంచి, చేతుల వేళ్లను శరీరం వైపు ఉండేలా చూసుకోవాలి. ధనురాసనం వలె మీ చేతులను నిఠారుగా.. వీపును కొంచెం వంచండి. ఇలా చేయడం మెడ ముందు భాగంలో ఎక్కువ సాగుతుంది.
ఇప్పుడు మీ తలను వెనుకకు వంచండి. ఇప్పుడు మీ కళ్ళు బాగా తెరిచి .. దృష్టిని ఒక స్థలం లేదా వస్తువుపై కేంద్రీకరించండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శరీరం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నోటి నుంచి నాలుకను బయట పెట్టి.. సింహం గర్జిస్తున్నట్లుగా “హా” అని పెద్దగా శబ్దం చేయండి. తర్వాత నోరు మూసి ముక్కు ద్వారా మళ్లీ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వజ్రాసనంలోకి వచ్చి.. కాళ్ళను నిటారుగా ఉంచి.. లోపలి శ్వాస తీసుకుని మళ్ళీ శ్వాసని విడవండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..