Vinayaka Chavithi 2025: దేశంలో ధనిక గణపతి మండపం… అక్కడ గణపయ్యకి రూ.474 కోట్ల ఇన్సూరెన్స్? ఎందుకంటే..
హిందువులు జరుపుకునే పండగలలో ముఖ్యమైన పండగ వినాయక చవితి. ఈ రోజునుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైంది. వినాయక మండపాలలో కొలువు దీరడానికి వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి. మరోవైపు దేశంలో అత్యంత సంప్పనమైన గణపతి మండపాన్ని రికార్డ్ స్థాయిలో ఇన్సూరెన్స్ చేయించి రికార్డ్ సృష్టించింది. గణపతిమండపం ఎక్కడ? ఎన్ని కోట్లకు భీమా చేసిందో తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా ఈనెల 27 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఇప్పటికే గల్లీ గల్లీలో వినాయక చవితి సందడి మొదలైంది. మండపాలలో కొలువుదీరడానికి రకరకాల గణపతి విగ్రహాలు సిద్ధం అవుతున్నాయి. మండపాల్లో కొలువుదీరెందుకు గణనాథులను నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. వినాయక చవితి పండగ అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే నగరం ముంబై. ఇక్కడ అనేక ప్రధాన కూడళ్ళలో మండపాలను భారీ సెట్టింగ్స్ తో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి భక్తులను ఆకర్షిస్తాయి. నగరంలో కింగ్స్ సర్కిల్ జీఎస్‌బీ సేవా మండల్ అత్యంత సంపన్న గణపతి మండపంగా పేరుగాంచింది. ఈ మండపాన్ని గత 70 ఏళ్లుగా ఏర్పాటు చేస్తోన్నారు. ఈ ఏడాది ఆగస్టు 27 31 వరకు ఐదు రోజుల గణేశోత్సవాన్ని నిర్వహిస్తుంది.
ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణేష్ మండలం, జిఎస్బి సేవా మండలం, కింగ్స్ సర్కిల్, ఈ సీజన్లో రూ.474.46 కోట్ల విలువైన రికార్డు బీమాను కొనుగోలు చేసింది. గత సంవత్సరం రూ.400 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డ్ ని బద్దలుకొట్టాడు. బంగారం, వెండి వస్తువుల విలువ పెరగడం, మరిన్ని స్వచ్ఛంద సేవకులు, పూజారులను చేర్చుకోవడం వల్ల ఈ భీమా కవరేజ్ పెరిగిందని తెలుస్తోంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ అందించే బీమా పాలసీలో మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, ఉత్సవాల్లో పాల్గొనే వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, పాదరక్షలను భద్రపరిచేవారు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా పరిధిలోకి వస్తారు. అంతేకాదు నవరాత్రి వేడుకల్లో మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడూ బీమా పరిధిలోకి వస్తాడని నిర్వాహకులు తెలిపారు.
రూ.474 కోట్లలో బంగారం, వెండి, ఆభరణాలను కవర్ చేసే ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ విలువ రూ.67 కోట్లు, ఇది 2024లో రూ.43 కోట్లు, 2023లో రూ.38 కోట్లుగా ఉంది. రూ.375 కోట్లలో అత్యధిక వాటా వ్యక్తిగత ప్రమాద బీమా .. స్వచ్ఛంద సేవకులు, పూజారులు, వంటవారు, వాలెట్లు , సెక్యూరిటీ గార్డులను కవర్ చేస్తుంది.
కాగా అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రెండు కోట్ల రూపాయల బీమా తీసుకున్నారు. రూ.30 కోట్ల విలువైన ప్రజా బాధ్యత పండళ్లు, స్టేడియంలు, భక్తులకు బీమా.. రూ.43 లక్షల మొత్తంలో వేదిక ప్రాంగణానికి ప్రామాణిక అగ్నిమాపక, ప్రత్యేక ప్రమాదం వంటివి కవర్ చేస్తుంది. ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. వినాయకచవితి నుంచి 10 రోజుల పాటు నిర్వాహకులు, భక్తులకు ఈ బీమా వర్తిస్తుందని వివరించారు.
GSB సేవా మండల్ చైర్మన్ అమిత్ పాయ్ మాట్లాడుతూ “బంగారం, వెండి వాల్యుయేషన్ పెరుగుదల ఎక్కువగా పెరిగిన నేపధ్యంలో ఈ భీమా మొత్తం పెరగడానికి కారణమైంది. 2024 గణేశోత్సవంలో ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77,000. ప్రస్తుతం ఈ ధర రూ. 1,02,000 కు పెరిగింది. గణపతిని 66 కిలోల బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








