AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Historic Sword: ముంబైలో అడుగు పెట్టిన చారిత్రాత్మక కత్తి… మరాఠా వారసత్వం పునరుద్ధరణ.. నేడు సీఎం ఆవిష్కరణ

నాగ్‌పూర్ భోసలే రాజవంశ స్థాపకుడు, మరాఠా కమాండర్ రఘుజీ భోసలే చారిత్రాత్మక కత్తిని లండన్ నుంచి నేడు ముంబైలో అడుగు పెట్టింది. ఈ కత్తిని ఘనంగా స్వాగతించారు. సాయంత్రం సిఎం ఫడ్నవీస్ కత్తిని ఆవిష్కరించనున్నారు. ఈ కత్తికి మరాఠా సామ్రాజ్యంతో సంబంధం ఉంది. రాజే రఘుజీ భోసలే ఛత్రపతి శివాజీ మహారాజ్ భోసలే రాజవంశానికి చెందినవాడు. తరువాత అతను మరాఠా సామ్రాజ్యం తరపున విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లకు తన అధికారాన్ని విస్తరించాడు.

Historic Sword: ముంబైలో అడుగు పెట్టిన చారిత్రాత్మక కత్తి... మరాఠా వారసత్వం పునరుద్ధరణ.. నేడు సీఎం ఆవిష్కరణ
Raje Raghuji Bhosale Sword
Surya Kala
|

Updated on: Aug 18, 2025 | 5:07 PM

Share

మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్ భోసలే రాజవంశ స్థాపకుడు, మరాఠా కమాండర్ రఘుజీ భోసలే చారిత్రాత్మక కత్తినిలండన్ లో జరిగిన వేలంలో కొనుగోలు చేసింది. ఈ కత్తి సోమవారం ముంబైకి చేరుకుంది. కత్తికి స్వాగతం, ప్రారంభోత్సవం కోసం భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కత్తిని ప్రారంభిస్తారు. ఉదయం కత్తి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఘన స్వాగతం పలికింది. సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ విమానాశ్రయంలో ఈ కత్తిని స్వాధీనం చేసున్నారు. దీని తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించి.. తర్వాత, ఈ చారిత్రక వారసత్వాన్ని బైక్ ర్యాలీ, చిత్రరథం ద్వారా పి.ఎల్. దేశ్‌పాండే మహారాష్ట్ర కళా అకాడమీకి తీసుకెళ్ళారు.

సాయంత్రం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కత్తిని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా పాల్గొంటారు. అంతేకాదు రఘుజీ రాజే భోసలే వారసుడు ముధోజీ రాజే భోసలే ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.

మరాఠా సామ్రాజ్యంతో సంబంధం ఈ చారిత్రాత్మక కత్తిని ఇటీవల లండన్‌లో జరిగిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కత్తి చరిత్రలోకి వెళ్తే.. ఈ కత్తి మరాఠా సామ్రాజ్యంతో ముడిపడి ఉంది. రాజే రఘుజీ భోసలే ఛత్రపతి శివాజీ మహారాజ్ భోసలే రాజవంశానికి చెందినవాడు. తరువాత అతను మరాఠా సామ్రాజ్యం తరపున విదర్భ .. ఛత్తీస్‌గఢ్‌లకు తన అధికారాన్ని విస్తరించాడు.

రఘుజీ భోసలే నాగ్‌పూర్‌ను తన రాజధానిగా చేసుకుని భోసలే రాజవంశం సొంతం శాఖను స్థాపించాడు. ఈ శాఖ తరువాత విదర్భ, మధ్య భారతదేశ రాజకీయాలలో చాలా ప్రభావవంతమైనదిగా మారింది. వారు ఛత్తీస్‌గఢ్, గోండ్వానా, కటక్ (ఒడిశా), బేరార్, బస్తర్‌లపై తమ ఆధిపత్యాన్నిప్రదర్శించి తమ రాజ్యాన్ని విస్తరించారు. మరాఠాల ఆధిపత్యాన్ని బెంగాల్ , ఒడిశాకు విస్తరించడంలో వీరు ప్రధాన పాత్ర పోషించారు.

నాగ్‌పూర్ బలపడింది 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతున్నప్పుడు.. రఘుజీ భోసలే, అతని సైన్యం ఉత్తర భారతదేశానికి చేరుకుని ఢిల్లీ రాజకీయాల్లో అనేకసార్లు జోక్యం చేసుకున్నారు. ఆయన నాగ్‌పూర్‌ను సాంస్కృతిక, పరిపాలనా దృక్కోణంలో బలోపేతం చేశారు. ఆయన పాలనలో నాగ్‌పూర్ మరాఠా శక్తికి ప్రధాన కేంద్రంగా మారింది.

రఘుజీ భోసలే కేవలం యోధుడు మాత్రమే కాదు. దార్శనిక పాలకుడు కూడా. ఆయన స్థాపించిన నాగ్‌పూర్ భోసలే శాఖ తరువాత బ్రిటిష్ వారికి, మరాఠాలకు మధ్య జరిగిన యుద్ధంలో ఒక ముఖ్యమైన పాత్రని పోషించింది. ఈ రోజు సాయత్రం ముంబైలో ఆవిష్కరించబోయే కత్తి నాగ్‌పూర్ భోసలే కుటుంబ స్థాపకుడు.. మరాఠా సామ్రాజ్యానికి శక్తివంతమైన అధిపతి అయిన రఘుజీ రాజే భోసలే వారసత్వంతో ముడిపడి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..