Bhagvad Gita: కృష్ణుడు గీతలో చెప్పిన ఈ వ్యక్తిత్వ వికాస పాఠాలు నేటికీ అనుసరణీయం.. ఈ 6 బోధనలు గుర్తించుకోండి
మహాభారత యుద్ధం సమయంలో కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు.. అర్జునుడికి చేసిన గీతోపదేశం.. జీవితంలో మెరుగైన వ్యక్తిగా ఎదిగడానికి ఎంతో సహాయకారి. మనిషి ఎలా జీవించాలి..ఎలా జీవించకూడదు అని తెలిపే వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పుతోంది. గీతోపదేశంలోని ఈ ఉపదేశాలను పాటిస్తే జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు.

ద్వాపర యుగంలో భూమి మీద పాపుల భారాన్ని తగ్గించేందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించాడు. మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి కర్మ, జ్ఞానం, భక్తి వంటి అనేక విషయాలను భోదించాడు. యుద్ధ భూమిలో అడుగు పెట్టిన అర్జునుడు నిస్సహాయస్థితిలో ఉన్న సమయంలో శ్రీ కృష్ణుడు చేసిన బోధనలు నేటికీ అనుసరణీయం. అవి మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తాయి. జీవితంలో మెరుగైన వ్యక్తిగా ఎదగడానికి గీతలోని ఈ 6 బోధనలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి..
మీ పని మీరు చేసుకోండి, ఫలితం గురించి చింతించకండి.
శ్రీకృష్ణుడు బోధించిన ప్రధాన బోధనలలో ఒకటి. మనం ఎల్లప్పుడూ మన కర్మలను బాగా చేయాలి. ప్రతిఫలాల గురించి చింతించకూడదు. గీతలో దీని గురించి ఒక శ్లోకం ఉంది “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూర్మ తే సంగోస్త్వకర్మణి” దీని అర్థం మనం మన పనిని నిజాయితీగా చేయాలి. పరిణామాల గురించి ఆలోచించకుండా మన పనిపై దృష్టి పెట్టాలి.
ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయకండి.
శ్రీమద్ భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మన నేటి పనిని రేపటికి లేదా తర్వాత చేద్దాం అని ఎప్పుడూ వాయిదా వేయకూడదని చెప్పాడు. మనం మన పనిని సకాలంలో పూర్తి చేయాలి. అలాంటి వారికి మాత్రమే విజయం లభిస్తుంది. లేకపోతే మీరు మీ జీవితాంతం విజయం సాధించడానికి పరిగెడుతూనే ఉండాల్సి ఉంటుంది.
మీ మీద నమ్మకం ఉంచుకోండి
గీతలో మనం ఎల్లప్పుడూ మనపై నమ్మకం ఉంచుకోవాలని ప్రత్యేకంగా చెప్పారు. మన సామర్థ్యాలను గుర్తించి ముందుకు సాగాలి. ప్రతి వ్యక్తికి వేర్వేరు సామర్థ్యాలు ఉంటాయి. మనం మన సామర్థ్యాలను గుర్తించి వాటిని విశ్వసించాలి.
మీ మనస్సును అదుపులో ఉంచుకోండి
గీతలో మన మనస్సును అదుపులో ఉంచుకోవాలని బోధించబడింది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు.. మనం మన చర్యలపై దృష్టి పెట్టాలి .. ఫలితాల గురించి చింతించకూడదు. మనం మన పనిని ప్రశాంతమైన మనస్సుతో చేయాలి. మన మనస్సు అదుపు తప్పకుండా చేస్తున్న పనిపై దృష్టి పెట్టాలి.
ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవండి
శ్రీ కృష్ణుడు ఇచ్చిన అతి ముఖ్యమైన సలహా ఏమిటంటే మనం ఎల్లప్పుడూ సత్య మార్గాన్ని అనుసరించాలి. సత్య మార్గం జీవితంలో మీకు ఉద్దేశించని ప్రతిదాన్ని పొందగలదు. సత్యమే మీరు ఓడిపోయిన యుద్ధంలో కూడా గెలవగలెందుకు ఉన్న మార్గం.
దేవునిపై అచంచలమైన విశ్వాసం
భగవంతుని పట్ల ప్రేమ , భక్తి భావన కలిగి ఉండాలని శ్రీ కృష్ణుడు గీతలో బోధించాడు. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కనుక భగవంతునిపై మీ విశ్వాసాన్ని నిలుపుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








