Mysterious Temple: ఈ వేణుగోపాల ఆలయంలో అన్నీ మిస్టరీలే.. నేటికీ వినిపిస్తున్న కన్నయ్య వేణువు నుంచి వేణునాదం..
భారతదేశంలోని హిందూ దేవాలయాలు కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినవి కూడా ఉన్నాయి. అనేక ఆలయాలకు సంబంధం ఉన్న అనేక పురాణ కథలు నేటికీ వినిపిస్తున్నాయి. కొన్ని దేవాలయాల గురించిన ఈ పురాణాల కథలే ఆ దేవాలయాల పట్ల ప్రజలకు ఆసక్తిని కలిగిస్తాయి. అంతేకాదు కొన్ని ఆలయాల్లోని రహస్యాల పట్ల భక్తులకు నమ్మకాన్ని పెంచుతాయి. అటువంటి రహస్యాన్ని దాచుకున్న ఆలయం కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని పాలీలో ఉంది, ఇక్కడ నేటికీ శ్రీ కృష్ణుడు స్వయంగా వేణువు వాయిస్తాడని.. ఆ వేణువు గానాన్ని వినగలమని భక్తులు నమ్ముతారు.

భారతదేశాన్ని దేవాలయాల దేశం అని పిలుస్తారు. మన దేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్దిగాంచిన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం కర్ణాటకలోని తాలిలో ఉంది, దీని పేరు వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని అద్భుతమైన దేవాలయాలలో ఒకటి. ఇది కర్ణాటకలోని హోసా కన్నంబాడిలోని కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట సమీపంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని వేణువు నుంచి స్వరం వినిపిస్తుందని చెబుతారు. అయితే ఈ వేణు నాదం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ఇదే ఈ ఆలయాన్ని మరమైన ఆలయంగా చేసింది.
శ్రీ కృష్ణుడు వేణువు వాయిస్తాడు!
ఈ ఆలయం కృష్ణ సాగర్ ఆనకట్ట సమీపంలో నిర్మించబడింది. ఇక్కడ కృష్ణుడు వేణువు వాయిస్తున్న విగ్రహం ఉంది. వేణువు అంటే మురళి అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన ఆవుల మందతో ఇక్కడ కూర్చుని వేణువు వాయించేవాడని చెబుతారు. అందుకే నేటికీ ఈ ఆలయంలో వేణువు వాయిద్యం వినిపిస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు.
70 సంవత్సరాలు నీటిలోనే ఉండిపోయిన ఆలయం
ఈ శ్రీ కృష్ణుని ఆలయ కథ చాలా అద్భుతంగా .. వినడానికి నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది. కర్ణాటకలోని హోవా కన్నంబాడిలోని కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట సమీపంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని హొయసల రాజవంశం నిర్మించారు. ఈ ఆలయ సముదాయం దాదాపు 50 ఎకరాలలో విస్తరించి ఉంది. KRS ఆనకట్ట పూర్తయిన తర్వాత..మొత్తం కన్నంబాడి నీటిలో మునిగిపోయింది. దీనితో పాటు ఆలయం కూడా 70 సంవత్సరాలకు పైగా నీటిలో మునిగిపోయింది. ఈ ఆలయ పునరుద్ధరణ 2011 సంవత్సరంలో పూర్తయింది.
ఆలయ నిర్మాణం
వేణుగోపాల స్వామి ఆలయ సముదాయం దాదాపు 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయానికి రెండు వైపులా వరండాలతో కూడిన భవనం ఉంది. దీని చుట్టూ యాగశాల , వంటగది ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక వసారా, మధ్య హాలు, ఒక ముఖ్య మంటపం, గర్భగుడి కూడా ఉన్నాయి. ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న గదిలో కేశవ ( కృష్ణుడు ) విగ్రహం ఉంది ..దక్షిణం వైపున ఉన్న గదిలో గోపాల కృష్ణుడి విగ్రహం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.