Tirumala: తిరుమలలో మరోసారి అపచారం.. మాడ వీధుల్లో తిరుగాడిన కారు.. మండిపడుతున్న భక్తులు

మరోసారి తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. భద్రత వైఫ్యలం వెల్లడైంది. ఆలయ మాడవీధుల్లోకి కారు దూసుకొచ్చింది. ఇన్నోవా కారుపై CMO స్టిక్కర్ ఉండటంతో భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వ్యవహరించారు.

Tirumala: తిరుమలలో మరోసారి అపచారం.. మాడ వీధుల్లో తిరుగాడిన కారు.. మండిపడుతున్న భక్తులు
Tirumala Mada Streets
Follow us
Surya Kala

|

Updated on: Feb 01, 2023 | 6:32 AM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. గత కొన్ని రోజుల క్రితం శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్  సోషల్ మీడియాలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది.. తిరుమలలో అపచారం చోటుచేసుకుందంటూ.. భద్రతా వైఫల్యం పై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఈ ఘటన ఇంకా మరచిపోక ముందే.. మరోసారి తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. భద్రత వైఫ్యలం వెల్లడైంది. ఆలయ మాడవీధుల్లోకి కారు దూసుకొచ్చింది. ఇన్నోవా కారుపై CMO స్టిక్కర్ ఉండటంతో భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వ్యవహరించారు. భద్రతా సిబ్బంది అడ్డుచెప్పకపోవడంతో కారును మాడ వీధుల్లోకి తీసుకొచ్చాడు ఆ డ్రైవర్. పార్కింగ్‌లో స్థలం లేకపోవడంతోనే తీసుకొచ్చానని.. భద్రతా సిబ్బంది అక్కడ లేరంటున్నారు ఆ కారు డ్రైవర్‌.

నిబంధల ప్రకారం మాఢవీధుల్లోకి వాహనాలు నిషేధం. టీటీడీ చైర్మన్, ఈఓ వాహనాలను కూడా మాడ వీధులకు దూరంగా నిలిపివేస్తారు. వీవీఐపీలు వచ్చినప్పుడు బ్యాటరీ బగ్గీల్లో మాడ వీధుల్లో తిరుగుతారు. భక్తులు కూడా చెప్పులు లేకుండానే వెళ్లాలి. అలాంటి ప్రాంతంలోకి వాహనం రావడంపై భక్తులు మండిపడుతున్నారు. సీఎంఓ స్టిక్కర్ తో మాడ వీధుల్లోకి వచ్చిన కారు సీఎం కార్యాలయానికి చెందిందా లేక ఫేక్ వెహికలా అని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎంవో స్టిక్కర్ ఉన్న కారు తిరగటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..