Vastu Tips: ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే విసిరిపారేయండి..! లేదంటే పగలు, పంతాలు తప్పవు..!!

నాట్యాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ పరమ శివుడు నృత్యం చేసే విశ్వరూపం బొమ్మ కనిపిస్తుంది. నిస్సందేహంగా నటరాజ స్వామి కళకు ప్రతీక. కానీ అదే సమయంలో ఇది..

Vastu Tips: ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే విసిరిపారేయండి..! లేదంటే పగలు, పంతాలు తప్పవు..!!
Vastu Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 04, 2023 | 8:03 PM

ఒక్కోసారి ఇంట్లో అకస్మాత్తుగా చాలా గొడవలు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాల్లో విబేధాలు తలెత్తుతాయి. ఇది కుటుంబంలో టెన్షన్, కోపం, పగలు పెంచుతుంది. ఇంటి సభ్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి ఇష్టపడరు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదా? అయితే దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అయితే, వాస్తు దోషం కూడా ఒక కారణంగా చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

ఇంట్లోని కొన్ని వస్తువులు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేసి కలహాలకు కారణమవుతాయి. ఈ వస్తువులు ఉంచితే ఆ ఇంట్లో కలహాలు వస్తాయి. ఇంట్లో ఉంచకూడని 5 వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

చిరిగిన పాత బట్టలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది. ఇది కుటుంబ సభ్యులలో ప్రతికూలతను పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మీ ఇంట్లో పగిలిన అద్దాలను ఉంచరాదు. ఇది కూడా మనసు విరిగిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి, పగిలిన గాజును వెంటనే పారవేయండి.

పాడైపోయిన బూట్లు, ఉపయోగించని చెప్పులు కూడా ఉంచవద్దు. దీని కారణంగా ఇంట్లో గొడవలు పెరుగుతాయి.. ఇంట్లో కలహాలు పెరుగుతాయి. వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయటపారేయండి.

ఇంట్లో పాడైపోయిన గడియారం ఆ ఇంటికి మంచిది కాదంటారు. దీని వల్ల గడ్డుకాలం ఎదురవుతుంది. కాబట్టి అది ఇంట్లో పడి ఉంటే వెంటనే దాన్ని బయట విసిరేయండి లేదా సరిచేసుకోండి.

పాడైపోయిన తాళాలు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కుటుంబానికి అశుభం. దీని వల్ల ఇంట్లో ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి మీ ఇంట్లో ఇలాంటివి ఉంటే చెత్తబుట్టలో వేయండి.

పాత వార్తాపత్రికల కట్ట కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇది ఇంటి వాస్తుపై కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఉపయోగించని వస్తువులు, చెడిపోయిన ఏదైనా వస్తువులను ఇంట్లో ఉంచడం వలన కష్టాలు పెరుగుతాయి.

నాట్యాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ పరమ శివుడు నృత్యం చేసే విశ్వరూపం బొమ్మ కనిపిస్తుంది. నిస్సందేహంగా నటరాజ స్వామి కళకు ప్రతీక. కానీ అదే సమయంలో ఇది విధ్వంసానికి చిహ్నం. నృత్య రూపం తాండవ నృత్యాన్ని సూచిస్తుంది. అంటే విధ్వంసం. కాబట్టి దానిని ఇంట్లో ఉండకుండా చూసుకోండి.

మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం..