AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Plants: ఇంట్లో ఈ 10 మొక్కలు నాటండి.. లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి..

Vastu Tips for Plants: వాస్తు శాస్త్రం ప్రకారం.. అనేక చెట్లు, మొక్కలు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా..

Vastu Tips for Plants: ఇంట్లో ఈ 10 మొక్కలు నాటండి.. లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి..
Shiva Prajapati
|

Updated on: Jan 25, 2022 | 5:31 PM

Share

Vastu Tips for Plants: వాస్తు శాస్త్రం ప్రకారం.. అనేక చెట్లు, మొక్కలు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తాయి. ఇంట్లో ఈ మొక్కలు నాటడం వల్ల ఏడాది పొడవునా డబ్బు సిద్ధిస్తూనే ఉంటుంది. ఈ మొక్కలు మనస్సును సైతం ప్రశాంతంగా ఉంచుతాయి. ఇంటి వాతావరణంలో సానుకూలతను తెస్తాయి. ఈ మొక్కల ద్వారా పూచే పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే.. అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ పుష్పాలతో పూజించడం వల్ల ఐశ్యర్యం లభిస్తుంది. శుభకార్యాలు చేపడితే ఎలాంటి ఆటంకం జరుగదు. ఈ మొక్కలు కుటుంబ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాదు.. ఈ మొక్కలను అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పని చేస్తాయి. మరి ఇంట్లో ఏ మొక్కలు నాటడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం..

మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం. మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశకు ఆధిదేవత వినాయకుడు కాగా ప్రతినిధి శుక్రుడు.

క్రాసులా ఓవాటా/జాడే మొక్క.. ఈ మొక్కను నాటడం ద్వారా సంపదను ఆకర్షిస్తుందని విశ్వాసం. ఫెంగ్ షుయ్ ప్రకారం.. క్రాసులా ఇంట్లోకి సంపదను ఆకర్షిస్తుంది. ఈ చెట్టును ఇంగ్లీష్‌లో జాడే ప్లాంట్, లక్కీ ప్లాంట్ అంటారు.

లక్ష్మణ మొక్క.. లక్ష్మణ మొక్క కూడా ధనలక్ష్మిని ఆకర్షించగలదు. ఇంట్లో కుండీలో దీనిని నాటుకోవచ్చు. ఎవరి ఇంట్లో లక్ష్మణ మొక్క ఉంటుందో వారి ఇంట్లో సంపద నిత్యం ఉంటుందని విశ్వాసం.

అరటి చెట్టు.. అరటి చెట్టు ఇంట్లో ఉండటం శుభప్రదం. బృహస్పతి కారకుడైనందున ఈశాన్యంలో ఈ చెట్టును నాటడం శ్రేయస్కరం. అరటిపండును విష్ణువు, లక్ష్మీదేవికి సమర్పించాలి.

తులసి మొక్క.. తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇంట్లో తూర్పు లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటాలి. తులసి ఇంట్లోని అన్ని రకాల క్రిములను నాశనం చేస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం నెలకొంటాయి.

అశ్వగంధ.. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో అశ్వగంధ చెట్టును నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అశ్వగంధ చెట్టు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధం.

కనేర్ మొక్క.. ఇందులో మూడు రకాల మొక్కలు ఉన్నాయి. తెల్ల కనెర్, ఎరుపు కనెర్, మూడవ పసుపు కనెర్. కనేర్ మొక్కను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవికి తెల్లటి కనెర్ పువ్వులు సమర్పిస్తారు. పసుపు పుష్పాలు విష్ణువుకు ప్రీతికరమైనవి.

శ్వేతార్క్(వైట్ ఆక్).. గణేశుడు శ్వేతార్క్ లేదా తెలుపు రంగులో నివసిస్తున్నాడని చెబుతారు. ముఖ్యంగా దీన్ని సక్రమంగా పూజించి ఇంట్లో ఉంచుకుంటే మేలు జరుగుతుంది. దీంతో ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఉంటాయి.

హర్సింగార్.. పారిజాత పువ్వులను హర్సింగార్ అని కూడా అంటారు. ఈ చెట్టు ఎవరి ఇంట్లో ఉంటే వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి వెల్లివిరుస్తుంది. ఈ చెట్టు పువ్వులు ఒత్తిడిని తగ్గించి, ఆనందాన్ని నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ట్యూబెరోస్.. ట్యూబెరోస్‌లో మూడు రకాలు ఉన్నాయి. దీని నుంచి సుగంధ నూనెలు, సుగంధ ద్రవ్యాలు కూడా తయారు చేస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

Also read:

Zero covid countries: షాకింగ్! ఈ ఏడు దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదవ్వలేదు.. ఎందుకో తెలుసా..

Viral Video: కుమ్మేందుకు దూసుకొచ్చి గొర్రె.. ఆ వ్యక్తి తప్పించుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే..

Telangana Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. లైవ్ వీడియో