Zero covid countries: షాకింగ్! ఈ ఏడు దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదవ్వలేదు.. ఎందుకో తెలుసా..
నేడు యావత్ ప్రపంచం కోవిడ్-19తో పోరాడుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మానవాళిని దడదడలాడిస్తోంది. మీ కెప్పుడైనా అనిపించిందా? ఈ భూమిపై కరోనా వైరస్ ప్రవేశించని లేదా ఒక్క కేసుకూడా నమోదవ్వని చోటు కనీసం ఒక్కటైనా ఉండి ఉంటుందా? అని. ఉన్నాయండీ!
These countries have successfully kept Covid-19 at bay: నేడు యావత్ ప్రపంచం కోవిడ్-19తో పోరాడుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మానవాళిని దడదడలాడిస్తోంది. మీ కెప్పుడైనా అనిపించిందా? ఈ భూమిపై కరోనా వైరస్ ప్రవేశించని లేదా ఒక్క కేసుకూడా నమోదవ్వని చోటు కనీసం ఒక్కటైనా ఉండి ఉంటుందా? అని. ఉన్నాయండీ! ఒకటి కాదు ఏకంగా 7 ప్రదేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసుకూడా నమోదుకాలేదు. కల.. కాదు. ఊహ అంతకన్నాకాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తర్వాత కూడా అనుమానాలుంటాయా? WHO 2019లో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వని (జీరో కోవిడ్ దేశాలు) దేశాల జాబితాను తయారు చేసింది.
తుర్క్‌మెనిస్తాన్ ఈ దేశం మధ్య ఆసియా రిపబ్లిక్‌లో ఉంది. కాస్పియన్ సముద్రం, కరాకుమ్ ఎడారి సరిహద్దులుగా ఉన్న ఈ దేశ ప్రభుత్వం స్వదేశానికి వెళ్లే విమానాలు మినహా సరిహద్దులన్నింటినీ పూర్తిగా మూసివేసింది. దేశానికి తిరిగి వచ్చే వ్యక్తులు ఖచ్చితంగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అలాగే ఈ దేశంలో 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న ప్రజలందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదుకాలేదని అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఐతే కొందరు వైద్య నిపుణులు, WHO అధికారులు ఆ దేశ ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కుక్ ఐలాండ్స్ దక్షిణ పసిఫిక్‌లో ఉన్న కుక్ దీవులు, న్యూజిలాండ్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుంది. స్నార్ కెల్లింగ్, స్కూబా-డైవింగ్‌కు కుక్ ద్వీపం ప్రసిద్ధి. తాజా సమాచారం ప్రకారం ఆ దేశ మొత్తం జనాభా 17, 459. వీరిలో 97 శాతం మంది ప్రజలు రెట్టింపు టీకాలు వేయించుకున్నారట.
డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రస్తుతం ఉత్తర కొరియా ప్రయాణికులను దేశంలోకి అనుమతించడం లేదు. అంతేకాదు ఆహారం, ఇతర వస్తువుల దిగుమతిని కూడా ఆ దేశం నిలిపివేసింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లను దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి పదేపదే తిరస్కరించింది ఉత్తర కొరియా. ఐతే దేశంలో జీరో కోవిడ్-19 కేసులున్నట్లు తాజాగా వెల్లడించింది. కఠిన ఆంక్షల మధ్య వ్యాక్సిన్ లేదా బిజినెస్ సర్టిఫికేట్ ప్రాతిపదికన దేశాల మధ్య ప్రయాణాలకు అనుమతించినట్లు అక్కడి మీడియా కథనాలు తెల్పుతున్నాయి. ఏదిఏమైనా ఈ మర్మదేశం రహస్యాలు చేధించడం అంత సులువేంకాదు.
టోకెలావ్ హవాయి, న్యూజిలాండ్ మధ్యలో ఉన్నచిన్న చిన్న ద్వీపాల సమూహమే ఈ టోకెలావ్ దేశం. ఇది డిపెండెంట్ టెరిటరీ. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా కాదు. విదేశీ ప్రయాణికుల తాకిడి కూడా తక్కువే. ఈ దేశంలో దాదాపు 68.6 శాతం మంది పూర్తిగా టీకాలు వేయించుకున్నారు.
కిరిబాటి కిరిబాటి ఒక ఐలాండ్ రిపబ్లిక్. దీనిని రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి అని పిలుస్తారు. ఇది మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పుడు, ద్వీపం సరిహద్దులను పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇక్కడి జనాభాలో దాదాపు 1.2 లక్షలు. వీరిలో 11,686 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు. అయినప్పటికీ అక్కడ ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.
నౌరు ఆస్ట్రేలియాలోని ఈశాన్య ప్రాంతంలో మైక్రోనేషియాలో ఉందీ దేశం. ఇది ఒక చిన్న ద్వీప దేశం. ఈ దేశం మొత్తం జనాభా 10, 834 కాగా, వీరికి 2021లో 100 శాతం వ్యాక్సిన్లు వేయించింది అక్కడి ప్రభుత్వం. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి రెండు వ్యాక్సిన్లు వేయించుకున్న సందర్శకులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటన కూడా విడుదల చేసింది.
తువాలు బ్రిటీష్ కామన్వెల్త్‌లో భాగమైన దక్షిణ పసిఫిక్‌లో ఉన్న ఒక ద్వీప దేశమే తువాలు. సరిహద్దులను పూర్తిగా మూసివేసి, ప్రయాణాలను నిషేధించింది. ఏప్రిల్ 2021లో దేశం మొత్తం మీద భారీ స్థాయిలో వ్యూహాత్మక వ్యాక్సిన్ ప్రణాళికలను అమలు చేసింది.
Also Read: