James Webb Space Telescope: గమ్యస్థానం చేరిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. విశ్వ రహస్యాల గుట్టు వీడేనా?
NASA: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్ 30 రోజుల ప్రయాణం తర్వాత తన గమ్యస్థాన్ని చేరుకుంది. ఇది మరొక మానవ గ్రహం కోసం అన్వేషణలో సహాయపడనుందని నాసా తెలిపింది.
NASA James Webb Space Telescope: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంతరిక్షంలోకి పంపిన అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సోమవారం (జనవరి 24) భూమికి ఒక మిలియన్ మైళ్ల దూరంలో తన చివరి గమ్యస్థానానికి చేరుకుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంతరిక్షంలో 30 రోజుల ప్రయాణం తర్వాత తన చివరి గమ్యాన్ని చేరుకుంది. ఈమేరకు నాసా ట్వీట్ చేసింది. “భూమి నుంచి సుమారు ఒక మిలియన్ మైళ్ల (1.5 మిలియన్ కి.మీ.) దూరంలో ఉన్న రెండవ లాగ్రాంజ్ పాయింట్ (L2) కక్ష్యలోకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చేరుకుంది. విజయవంతంగా తన గమ్యస్థానానికి చేరకుంది. అది L-2 చుట్టూ తిరుగుతుంది” అంటూ ట్వీట్‌లో పేర్కొంది.
ఫ్రెంచ్ గయానాలోని గయానా స్పేస్ సెంటర్ నుంచి క్రిస్మస్ రోజున (డిసెంబర్ 25) NASA దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. జనవరి 8, 2022 న, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంతరిక్షంలో మోహరించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చివరి సన్‌షీల్డ్ శనివారం (జనవరి 8) నాడు పూర్తయింది. ఈ టెలిస్కోప్‌లోని చివరి రెక్కను సెట్ చేయడానికి బృందం చాలా కష్టపడాల్సి వచ్చిందని నాసా ట్వీట్ చేసింది. ఈ వింగ్‌ను సరైన స్థలంలో ఉంచడానికి చాలా గంటలపాటు నాసా బృందం పని చేసింది.
లాంచింగ్ రాకెట్ లోపల టెలిస్కోప్‌ను అమర్చడం చాలా కష్టమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. టెలిస్కోప్ చాలా పెద్దది. దానిని మడతపెట్టి అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. టెలిస్కోప్‌ను తెరవడం సంక్లిష్టమైన, సవాలుతో కూడుకున్న పని అని నాసా తెలిపింది. ఇది చాలా కష్టతరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంతరిక్షంలో నాసా హబుల్ స్థానంలో పనిచేయనుంది.
ఇది సమస్య.. ఇంజనీర్లు షీల్డ్ మొదటి స్థాయిని పూర్తి చేయాడానికి ముందు వెబ్ పవర్ సబ్‌సిస్టమ్‌ను అర్థంచేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించారు. ఈ సమయంలో వారు రెండు సమస్యలను ఎదుర్కొన్నారు. సన్‌షీల్డ్‌ను బిగించడానికి ఉపయోగించే ఆరు మోటార్లకు సంబంధించి మొదటి సమస్య కాగా, సూర్యకిరణాల కారణంగా మోటార్ల ఉష్ణోగ్రత పెరిగింది. దీంతో ఇంజినీర్లు నీడలో వాటిని సెట్ చేయాల్సి వచ్చింది. రెండవ అడ్డంకి సోలార్ ప్యానెల్. ఇది వెబ్ శక్తిని ప్రభావితం చేస్తుంది. మొత్తంగా టెలిస్కోప్‌లో ఐదు సౌర ఫలకాలను విజయవంతంగా అమర్చారు.
మరొక మానవ గ్రహం కోసం అన్వేషణలో.. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ త్వరలో విశ్వం రహస్యాలను వెలికితీసే పనిని ప్రారంభిస్తుంది. గ్రహాల నుంచి నక్షత్రాల వరకు, నెబ్యులా నుంచి గెలాక్సీల వరకు ప్రతీదానిపై శోధన చేయనుంది. చాలా సహజంగా గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించిన అన్ని చర్చలను నిశ్చయాత్మకంగా పరిష్కరించడానికి ఇది ఒక మార్గంగా నాసా పనిచేస్తుంది.
Also Read: Maruti Suzuki YY8: టాటాతో పోటీకి సిద్ధమంటోన్న మారుతీ.. ఎలక్ట్రిక్ కార్ తయారీ.. ధరెంతంటే?
Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. తక్కువ ధరలో ఎక్కవ ఫీచర్లు..!