Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. తక్కువ ధరలో ఎక్కవ ఫీచర్లు..!

రీబాక్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ పేరు రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0. కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్‌ని అమెజాన్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్..

Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. తక్కువ ధరలో ఎక్కవ ఫీచర్లు..!
Reebok Activefit 1.0 Smartwatch
Follow us

|

Updated on: Jan 25, 2022 | 7:24 AM

Reebok ActiveFit 1.0 Smartwatch: రీబాక్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ పేరు రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0. కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్‌ని అమెజాన్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, వీనీ, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 4,499గా ఉంది. దీని విక్రయం జనవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. వాచ్‌లో 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. SpO2, హార్ట్ బీటింగ్ సెన్సార్ వంటి అనేక గొప్ప ఫీచర్లు అందించారు.

రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు.. ఈ స్మార్ట్ వాచ్ 1.3-అంగుళాల HD డిస్ప్లేతో వస్తుంది. రౌండ్ షేప్ డయల్‌తో కూడిన ఈ స్మార్ట్‌వాచ్ IP67 రేటింగ్‌తో అందించారు. ఈ రేటింగ్ ఈ వాచ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో విడుల చేశారు. వాచ్ ప్రత్యేకత ఏమిటంటే, కాల్, మెసేజ్ నోటిఫికేషన్‌లతో పాటు, సోషల్ మీడియా యాప్ నోటిఫికేషన్‌లు, కెమెరా-మ్యూజిక్ కంట్రోల్స్, బిల్ట్-ఇన్ గేమ్‌లు ఇచ్చారు.

యూజర్ ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం, 24×7 హార్ట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ (SpO2)తో స్లీపింగ్ ట్రాకింగ్, సెడెంటరీ రిమైండర్ వంటి ఫీచర్‌లు అందించారు. ఈ రీబాక్ వాచ్‌లో 15 ఫిట్‌నెస్ ట్రాకింగ్ మోడ్‌లను అందించారు. స్మార్ట్‌వాచ్‌లో మహిళల కోసం పీరియడ్ సైకిల్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్‌లో క్యాలరీ, స్టెప్ ట్రాకర్‌ను కూడా అందించారు. బ్యాటరీ గురించి చెప్పాలంటే, ఈ స్మార్ట్‌వాచ్‌లో అందించిన బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది. అదే సమయంలో దీని స్టాండ్‌బై టైం 30 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Also Read: Sport Bikes: బైక్ అంటే ఇష్టమా.. లక్షలోపు వచ్చే బైకుల గురించి తెలుసుకోండి..?

Microsoft New feature: అదిరిపోయే ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌.. మ‌రింత యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఎక్స్ఎల్‌..