- Telugu News Photo Gallery Technology photos Xiaomi launching new smartphone from redmi serie redmi 11s on february 2nd
Redmi Note 11S: రెడ్‌మీ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. నోట్ 11 ఎస్ వచ్చేదెప్పుడంటే..
Redmi Note 11S: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గం షావోమీ భారత మార్కెట్లోకి రెడ్‌మీ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. రెడ్‌మీ నోట్ 11 ఎస్ పేరుతో రానున్న ఈ ఫోన్ ఫీచర్ల ఎలా ఉండనున్నాయంటే..
Updated on: Jan 25, 2022 | 10:45 AM

స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చైనాకు చెందిన షియోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ సిరీస్‌లో భాగంగా రానున్న రెడ్‌మీ నోట్ 11 ఎస్ విడుదల తేదీనీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

రెడ్‌మీ 11 సిరీస్‌లో భాగంగా రానున్న ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 9న భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి.

వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.46 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. లాక్ బటన్ పక్కన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించనున్నారు. వీటితో పాటు వెనుక ఎల్ఈడీతో కూడిన నాలుగు కెమెరాలను అందించనున్నారు.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. గరిష్ఠంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.





























