Viral Video: కుమ్మేందుకు దూసుకొచ్చి గొర్రె.. ఆ వ్యక్తి తప్పించుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే..

Viral Video: సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏం జరిగినా.. ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి.

Viral Video: కుమ్మేందుకు దూసుకొచ్చి గొర్రె.. ఆ వ్యక్తి తప్పించుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే..
Follow us

|

Updated on: Jan 25, 2022 | 5:19 PM

Viral Video: సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏం జరిగినా.. ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి.. వీడియోలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక గొర్రె.. ఒక వ్యక్తిని కుమ్మడానికి ప్రయత్నించి పెద్ద బకరా అయ్యింది.

భారతదేశంలో చాలా మంది రైతులు పెద్ద ఎత్తున గొర్రెలను సాదుతారు. ఉన్ని, మాంసం, పాల కోసం వాటిని పెంచుతుంటారు. సాగుకు పనికిరాని భూముల్లో గొర్రెలను మేపుతుంటారు. సాధారణంగానే.. గొర్రెలు కూల్‌గా ఉంటాయి. ఎవరి జోలికి పోకుండా వాటి పాటికి అవి మేత మేస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం భయంకరంగా ఉంటాయి. తాజాగా కోపోద్రిక్తమైన ఓ గొర్రెకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక గొర్రె తీవ్ర ఆగ్రహంతో వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది.

కోపంతో ఉన్న గొర్రె.. వ్యక్తిని కుమ్మేందుకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అది గమనించిన వ్యక్తి దాని నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. గొర్రె పరుగెత్తుకుంటూ రాగా, అతను దానిపై నుంచి ఒక్కసారిగా జంప్ చేశాడు. అలా గుర్రెను బకరా చేసి.. తాను సేఫ్ అయ్యాడు. కానీ, గొర్రె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు మూడు సార్లు ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది.

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌ ఐడీ wild_animals_of_theworld లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 40 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. వందలాది లైక్స్ వచ్చాయి. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Telangana Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. లైవ్ వీడియో

TTD: తిరుమల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ అలర్ట్.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనం చేసుకునే ఛాన్స్..

Rashmika Mandanna: శ్రీవల్లికి బాలీవుడ్‏లో మరో ఆఫర్.. బడా ప్రొడ్యూసర్‏తో మంతనాలు అందుకేనా ?..

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే