Vastu Tips: తలుపు వైపు పాదాలు ఉంచి నిద్రించడం శుభమా, అశుభమా..! నియమం ఏమిటంటే

ఒక నమ్మకం ఏమిటంటే తలుపు వైపు కాళ్లతో నిద్రించడం అశుభం. ఈ నమ్మకం తరతరాలుగా వస్తున్నది. మనలో చాలామంది దీనిని నమ్ముతారు. అయితే దీనికి కారణాలు ఏమిటో.. అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ సంస్కృతిలో తలుపు వైపు పాదాలతో నిద్రించడం అశుభం. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చి మనిషి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.

Vastu Tips: తలుపు వైపు పాదాలు ఉంచి నిద్రించడం శుభమా, అశుభమా..! నియమం ఏమిటంటే
Vastu Tips
Follow us

|

Updated on: Aug 17, 2024 | 9:21 AM

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం, వస్తువులు పెట్టుకునే విధానంతో పాటు.. ఇంట్లో నివశించే వ్యక్తుల జీవన శైలి కూడా మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని బెడ్ రూమ్ ఏర్పాటు మాత్రమే కాదు.. నిద్రపోయే విధానం కూడా శుభాఆశుభాలను తెలుపుతుంది. తలుపు వైపు పాదాలతో నిద్రించడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ఇలాంటి అనేక సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నాయి. ఇవి మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి ఒక నమ్మకం ఏమిటంటే తలుపు వైపు కాళ్లతో నిద్రించడం అశుభం. ఈ నమ్మకం తరతరాలుగా వస్తున్నది. మనలో చాలామంది దీనిని నమ్ముతారు. అయితే దీనికి కారణాలు ఏమిటో.. అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

భారతీయ సంస్కృతిలో తలుపు వైపు పాదాలతో నిద్రించడం అశుభం. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చి మనిషి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. మత విశ్వాసాల ప్రకారం దేవతలు, పూర్వీకుల శక్తి తలుపు ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల తలుపు వైపు పాదాలతో నిద్రించడం సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. అంతేకాదు వ్యక్తి శ్రేయస్సు, ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే

ఇవి కూడా చదవండి

వాస్తు శాస్త్రం ప్రకారం తలుపు వైపు పాదాలతో నిద్రించడం అశుభం. పడుకునేటప్పుడు మీ తలను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరం. ఇది మన జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది. వ్యక్తికి ఆరోగ్యం, సంపద, ఆనందం పెరుగుతుంది. అదే సమయంలో తలుపు వైపు పాదాలతో పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఇది వ్యక్తి జీవితంలో అనేక అడ్డంకులను కలిగిస్తుంది.

సైన్స్ ఏమి చెబుతుందంటే

శాస్త్రీయ దృక్పథం ప్రకారం తలుపు వైపు పాదాలను ఉంచి నిద్రించడం వల్ల ఎటువంటి హాని జరగదు. ఇది పూర్తిగా పురాణాల ప్రకారం నమ్మకం. ఇక ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం శాస్త్రీయ దృక్కోణంలో మంచిది కాదు. శాస్త్రీయ దృక్కోణంలో మనిషికి మంచి నిద్ర వచ్చే విధంగా నిద్రపోవాలి. తద్వారా అతను శారీరక, మానసిక విశ్రాంతిని పొందగలడు.

ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఆరోగ్య దృక్కోణంలో చూస్తే ఒక వ్యక్తి నిద్రపోయే దిశ అతని నిద్ర, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు భూమి అయస్కాంత క్షేత్రం మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించడం శాస్త్రీయంగా సరైనది కాదు. ఈ కారణంగా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు