AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం సూర్య భగవానుడి ఆరాధనతో కలిగే లాభాలు తెలుసా? ఇలా చేయండి

ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయడిన రోజు. అందుకే ఈ రోజు సూర్యుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సూర్యుడు గ్రహాలకు అధిపతి. ఆయనే సమస్త జీవులకు శక్తిని అందించే దేవుడు. అందుకే సూర్య భగవానుడిని ఆరాధిస్తే శరీర ఆరోగ్యం, మానసిక బలం, జీవితంలో స్థిరత్వం లభిస్తాయని నమ్మకం.

ఆదివారం సూర్య భగవానుడి ఆరాధనతో కలిగే లాభాలు తెలుసా? ఇలా చేయండి
Surya Bhagavan
Rajashekher G
|

Updated on: Jan 10, 2026 | 9:17 PM

Share

హిందూ ధర్మంలో వారంతోని ప్రతి రోజుకూ ఓ విశిష్టత ఉంటుంది. ఎందుకంటే, ప్రతి వారానికి ఒక దేవతను అధిష్ఠాన దేవుడిగా భావిస్తారు. వాటిలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు జీవనశక్తికి, ఆరోగ్యానికి, తేజస్సుకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పూజింపబడతాడు. ఆదివారం సూర్యుని ఆరాధన చేయడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య, ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి.

సూర్య భగవానుడి ఆరాధన ప్రాముఖ్యత

సూర్యుడు గ్రహాలకు అధిపతి. ఆయనే సమస్త జీవులకు శక్తిని అందించే దేవుడు. అందుకే సూర్య భగవానుడిని ఆరాధిస్తే శరీర ఆరోగ్యం, మానసిక బలం, జీవితంలో స్థిరత్వం లభిస్తాయని నమ్మకం.

ఆదివారం సూర్యారాధన వల్ల కలిగే ముఖ్య ఫలితాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదివారం ఉదయం సూర్యునికి నీటిని అర్పించడం వల్ల శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. కంటి సమస్యలు, అలసట, రోగనిరోధక శక్తి లోపం వంటి సమస్యలు తగ్గుతాయని విశ్వాసం.

ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు

సూర్యుడు ఆత్మగౌరవానికి కారకుడు. ఆయనను భక్తితో ఆరాధిస్తే భయాలు తగ్గుతాయి. ధైర్యం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. ఉద్యోగం, గౌరవం, అధికార యోగం కలుగుతుంది.

సూర్యారాధన వల్ల ఉద్యోగ జీవితంలో గుర్తింపు, ఉన్నతాధికారుల మద్దతు, ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

తండ్రి సంబంధిత సమస్యలు తగ్గుతాయి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు తండ్రిని సూచిస్తాడు. తండ్రితో విభేదాలు, కుటుంబ గౌరవానికి సంబంధించిన సమస్యలు ఉంటే సూర్య భగవానుడి ఆరాధనతో పరిష్కారం లభిస్తుందని నమ్మకం.

గ్రహ దోష నివారణ

జాతకంలో సూర్య దోషం, గ్రహబలం తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఆదివారం సూర్యారాధన ద్వారా కొంతవరకు తగ్గుతాయని భావిస్తారు.

ఆదివారం సూర్య భగవానుడిని ఎలా ఆరాధించాలి?

ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి తామ్ర పాత్రలో నీరు తీసుకుని, అందులో ఎర్ర పువ్వు లేదా కుంకుమ వేసి సూర్యునికి అర్పించాలి “ఓం సూర్యాయ నమః” మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించాలి ఆదివారం ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ధరించడం శుభకరం గోధుమలు, బెల్లం, ఎర్ర పండ్లు దానం చేయడం మంచిదిగా భావిస్తారు.

ఆదివారం సూర్య భగవానుడి ఆరాధన వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం గౌరవం, అధికార యోగం, కుటుంబ శాంతి, గ్రహ దోష నివారణ వంటి శుభఫలితాలను అందిస్తుందని భక్తుల నమ్మకం. భక్తితో, నియమంతో చేసే సూర్యారాధన జీవితం మీద సానుకూల ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌ రాబోతోంది! అదేంటంటే..?
వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌ రాబోతోంది! అదేంటంటే..?
క్రెడిట్‌ కార్డ్‌తో ఇంటి అద్దె కడుతున్నారా? చిక్కులు తప్పువు!
క్రెడిట్‌ కార్డ్‌తో ఇంటి అద్దె కడుతున్నారా? చిక్కులు తప్పువు!
తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తత్కాల్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్‌ ఎందుకు రాదు?
తత్కాల్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్‌ ఎందుకు రాదు?
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి