కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

హిందూ మతంలో కొంత మంది దేవుళ్ళను తిధుల ఆధారంగా ప్రత్యేకంగా పూజిస్తారు. ఇందుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పండుగలు ఉన్నాయి. ఉదాహరణకు చైత్రమసంలోని నవమిని శ్రీరామ నవమి అని.. భాద్రప్రదమాసం లోని చతుర్ధిని వినాయక చవితి అని శ్రీ కృష్ణుడి పుట్టిన తిధిని జన్మాష్టమి అని ఇలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. శ్రీకృష్ణుని జన్మదినాన్ని.. కృష్ణ జన్మాష్టమిగా 2024లో కూడా ఘనంగా జరుపుకోవడానికి కన్నయ్య భక్తులు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు
Janmashtami
Follow us

|

Updated on: Aug 17, 2024 | 8:15 AM

హిందూ మతంలో రాముడు, శివుడు, విష్ణువు, హనుమంతుడు వంటి వివిధ దేవుళ్లను మాత్రమే కాదు కనక దుర్గ, కాళికాదేవి, లక్ష్మీదేవి ఇలా రకరకాల దేవతలను కూడా పూజిస్తారు. వీరిలో శ్రీకృష్ణుడు అత్యంత ప్రీతిపాత్రుడు. చాలా మంది విదేశీయులు కూడా శ్రీకృష్ణునిపై భక్తి విశ్వాశాలను కలిగి ఉంటారు. ఎంతో భక్తిశ్రద్దలతో పూజిస్తారు. భగవంతుడిని ఎప్పుడైనా పూజించవచ్చు. అయితే హిందూ మతంలో కొంత మంది దేవుళ్ళను తిధుల ఆధారంగా ప్రత్యేకంగా పూజిస్తారు. ఇందుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పండుగలు ఉన్నాయి. ఉదాహరణకు చైత్రమసంలోని నవమిని శ్రీరామ నవమి అని.. భాద్రప్రదమాసం లోని చతుర్ధిని వినాయక చవితి అని శ్రీ కృష్ణుడి పుట్టిన తిధిని జన్మాష్టమి అని ఇలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. శ్రీకృష్ణుని జన్మదినాన్ని.. కృష్ణ జన్మాష్టమిగా 2024లో కూడా ఘనంగా జరుపుకోవడానికి కన్నయ్య భక్తులు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

మధురలో కృష్ణ జన్మాష్టమి

మధురలోని ప్రతి అణువణువున శ్రీకృష్ణుడు ఉన్నాడని విశ్వాసం. ఇక్కడ జన్మాష్టమి పండుగను రెండు భాగాలుగా జరుపుకుంటారు. మొదటి వేడుకగా ఝులన్ ఉత్సవం, రెండవ ఉత్సవం ఘాట్. ఝులన్ ఉత్సవం సందర్భంగా, మధురలోని ప్రజలు తమ ఇళ్లలో ఊయలలను ఏర్పాటు చేస్తారు. వాటిలో బాల కృష్ణుడి విగ్రహాలను ఉంచుతారు. ఈ ఊయలలో శ్రీకృష్ణుడు ఊగుతూ భక్తులు చేసే సేవలను అందుకుంటాడు. స్వామికి పాలు, తేనె, నెయ్యి, పెరుగుతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు, నగలు ధరింపజేస్తారు.

ఇవి కూడా చదవండి

రెండవ భాగం ఘాట్ సంప్రదాయం ప్రకారం,.. ఆ ప్రదేశంలోని ప్రతి ఆలయానికి ఒకే రంగులో లేదా కృష్ణుడు జన్మించిన సమయంలో ప్రతి ఆలయంలో పూజలు ఏకకాలంలో జరుగుతాయి. ఆలయ గంటలు ఏకకాలంలో మోగుతాయి. భక్తులు రాధ కృష్ణ నామాలను జపిస్తారు. ఈ సమయంలో మధుర, బృందావన్ దేవాలయాలలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది.

మధ్యప్రదేశ్ లో కృష్ణ జన్మాష్టమి

మధ్యప్రదేశ్‌లో కూడా కృష్ణ జన్మాష్టమి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడ ఈ పండుగను కాస్త భిన్నంగా జరుపుకుంటారు. గత 100 సంవత్సరాలుగా శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత అతని జాతకాన్ని తయారు చేసే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి నామకరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో శ్రీకృష్ణునికి రకరకాల పేర్లు పెడతారు.

ద్వారకలో కృష్ణ జన్మాష్టమి

ద్వారక గుజరాత్‌లో ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత, శ్రీకృష్ణుడు ఇక్కడ స్థిరపడ్డాడని.. తన పరివారంతో చాలా సంవత్సరాలు నివసించాడని చెబుతారు. ఈ ప్రదేశం గొప్ప పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నగరాన్ని శ్రీకృష్ణుడి అన్న బలరాముడు నిర్మించాడని కూడా నమ్ముతారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరం మొత్తం అందంగా అలంకరించబడుతుంది. ఇక్కడి ఆలయాల వైభవం కూడా పూర్తిగా భిన్నమైన రీతిలో కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో దేవాలయాలలో భజన, కీర్తన, మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజలు కూడా గర్భా నృత్యం చేస్తూ కనిపిస్తారు.

ముంబైలో కృష్ణ జన్మాష్టమి

సర్వసాధారణంగా ముంబైలో గణేష్ చతుర్థి సందర్భంగా విభిన్నమైన ఉత్సాహం ఉంటుంది అని అనుకుంటారు.. అయితే ఇక్కడ జరిగే శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా తక్కువేం కాదు. దహి అండి .. అంటే ఉట్టి కొట్టే కార్యక్రమం ముంబైలో చాలా వైభవంగా, అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడి పిరమిడ్లను తయారు చేస్తారు. ఈ సమయంలో భిన్నమైన వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తోంది. ముంబైలోని జన్మాష్టమి కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు