AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Home: ఇంట్లో ఈ వస్తువులు ఖాళీగా ఉంటే.. ఆర్ధిక ఇబ్బందులకు వెల్కం చెప్పినట్లే..

వాస్తు శాస్త్రం ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంట్లో సంపదను పెంచే అనేక చర్యలను వాస్తు శాస్త్రంలో ప్రస్తావించారు. అదే సమయంలో ఇంట్లో కొన్ని వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో వారు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. పేదరికం నెలకొంటుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

Vastu  Tips for Home: ఇంట్లో ఈ వస్తువులు ఖాళీగా ఉంటే.. ఆర్ధిక ఇబ్బందులకు వెల్కం చెప్పినట్లే..
Vastu Tips
Surya Kala
|

Updated on: Feb 28, 2025 | 1:55 PM

Share

ప్రతి వ్యక్తి జీవితంలో మంచి, చెడు సమయాలు ఉంటాయి. మంచి సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని అనుభవిస్తారు. చెడు సమయాల్లో కష్టాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పేదరికంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిల్లో ఇంట్లో సంపదను పెంచే అనేక చర్యల గురించి వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి వాటిల్లో ఒకటి ఇంట్లో కొన్ని వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. వీటిని ఇంట్లో ఖాళీగా ఉంచితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. సంపదల దేవత లక్ష్మిదేవి ఆగ్రహం చెందుతుంది. అప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

ఆహార ధాన్యాలు

ఇంట్లో ఆహార ధాన్యం నిల్వ ఎల్లప్పుడూ ఉండాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో బియ్యం నిల్వ చేసే పాత్ర ఎన్నడూ ఖాళీగా ఉండకూడదు. ఇంట్లో ఆహార ధాన్యం నిల్వలో కొరత ఏర్పడితే దానిని వెంటనే తిరిగి నింపాలి. ఆహార ధాన్యాలు నిండుగా ఉన్న ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి.

బాత్రూంలో ఖాళీ బకెట్

ఇంట్లో బాత్రూంలో ఉంచిన బకెట్ ఎల్లప్పుడూ నిండి ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. బాత్రూంలో బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూలత ఖాళీ బకెట్ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఇంట్లో సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో బాత్రూంలో ఉన్న బకెట్ ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండాలి. అలాగే విరిగిన బకెట్‌ను ఉపయోగించకూడదు.

ఇవి కూడా చదవండి

పూజా మందిరంలో పంచ పాత్ర

పూజ గదిలో పెట్టుకునే పంచ పాత్ర లేదా.. నీరు పెట్టుకునే పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. పూజ తర్వాత ఆ పాత్రను ఎల్లప్పుడూ నీటితో నింపాలి. పూజ గదిలోని నీటిలో గంగా జలం , తులసి దళాలను కూడా జోడించాలి. దేవుడు దాహం వేసినప్పుడు ఆ నీటిని తాగుతాడని నమ్ముతారు. పూజ గదిలో పంచ పాత్ర ఖాళీగా ఉంచితే.. అది ఇంట్లో ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది.

డబ్బులు పెట్టుకునే బాక్స్ లేదా సేఫ్

ఇంట్లో ఉన్న సేఫ్ కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఎంత అవసరం వచ్చినా సేఫ్ లో కనీసం కొంత డబ్బు అయినా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బులను పెట్టే బాక్స్ ఖాళీ చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో పేదరికంతో ఇబ్బంది పడేలా చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..