Vastu Tips: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా..? ఇలా చేసి చూడండి డబ్బే డబ్బు..!
మన జీవితంలో చాలా సమస్యలకూ కారణం ఆర్థిక ఇబ్బందులే. డబ్బు లభించడం ఆలస్యమైతే మనలోని ఆనందం తగ్గిపోతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచితే ఆర్థిక స్థితి మెరుగవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ధనం నిలబడేలా చేస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అయితే ఈ ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచండి.
Prashanthi V | Edited By: Shaik Madar Saheb
Updated on: Mar 01, 2025 | 9:28 AM

ఇంట్లో విపత్తులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రావడానికి నెగెటివ్ ఎనర్జీ ఒక కారణంగా ఉంటుంది. ఆ నెగెటివ్ శక్తిని తొలగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలను సూచించారు. అవేంటో చూద్దాం.

ఏనుగు తెలివితేటలతో, సంపదతో, శక్తితో కూడిన జీవిగా పరిగణించబడుతుంది. ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచితే అదృష్టం, ఆర్థిక ప్రగతి పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉత్తర దిశలో లేదా నైరుతి మూలలో ఈ విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం.

చేప ఆరోగ్యానికి, శాంతికి, ధనప్రాప్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంతేకాకుండా చేపల ఆకృతి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెండి లేదా ఇత్తడితో తయారు చేసిన చేప విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ధన లాభం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

శ్రీకృష్ణుడి చేతిలో వేణువు ఉండడం అందరికీ తెలుసు. అది శాంతిని, ఆనందాన్ని, సంపదను ప్రదర్శిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో వేణువును ఉంచడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వేణువు నెగెటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో సంతోషాన్ని, ఆర్థిక ప్రగతిని పెంచుతుంది.

సాధారణంగా మనం చూసే కొబ్బరికాయలో మూడు కళ్ళుంటాయి. కానీ అరుదుగా కనిపించే ఒంటి కన్ను కొబ్బరికాయ ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది ఇంట్లో నిలిచిపోయే నెగెటివ్ శక్తిని తొలగించడమే కాకుండా కొత్త సంపదను ఆకర్షిస్తుంది.

గోమతి చక్రం ఒక ప్రత్యేకమైన రత్నం ఇది సముద్రంలో మాత్రమే లభిస్తుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల నిధి ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా దీన్ని లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఉపయోగిస్తే ఆర్థికంగా లాభాలు చేకూరతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ధనలక్ష్మీ ఆశీస్సులను పొందాలని అనుకుంటే ఇంట్లో కమల గట్టే పెట్టుకోవడం మంచిదని చెబుతారు. దీనిని ఇంట్లో పూజా మందిరంలో ఉంచితే సంపద పెరుగుతుందని నమ్మకం.





























