బిగ్ బాస్ సీజన్9 హోస్టుగా నాగార్జున ఔట్.. లైన్ లోకి మరో క్రేజీ హీరో?
బిగ్ బాస్ అభిమానులు బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 పూర్తి చేసుకొని, సీజన్9లోకి అడుగు పెట్టబోతుంది. త్వరలోనే సీజన్ 9 కూడా ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Updated on: Mar 01, 2025 | 11:07 AM

అసలు విషయంలోకి వెళ్లితే..బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఎప్పటి నుంచో నాగార్జునే హోస్టుగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయన హోస్టింగ్ పై చాలా విమర్శలు తలెత్తాయి. దీంతో సీజన్8లో ఈయనపై చాలా నెగిటివిటీ ఏర్పడింది. దీంతో బిగ్ బాస్ టీం సరికొత్త ప్లాన్ చేశారంట.

అన్ స్టాపబుల్ టాక్ షోతో.. ఆహాలో సందడి చేస్తూ, మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణను బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి హోస్టుగా తీసుకురావాలనుకున్నారంట. కానీ ఆయన నో చెప్పడంతో, మరో క్రేజీ హీరో వద్దకు ఈ ఆఫర్ వెళ్లినట్లు తెలుస్తుంది.

అర్జున్ రెడ్డి మూవీతో ఓ వర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్9కి హోస్టుగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ టీం, ఈ హీరోను సంప్రదించి, భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారంట.

దీంతో విజయ్ దేవరకొండ కూడా హోస్టుగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా హోస్టింగ్ అనేది సరికొత్త చాలెంజ్‌గా రౌడీ హీరో భావిస్తున్నట్లు సమాచారం.

అంతే కాకుండా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ వెళ్లనున్నారు, బీబీ సీజన్9 సెటబ్రిటీస్ వీరే అంటూ చాలా వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా, అసలు నిజం ఏంటో తెలియాలంటే. బిగ్ బాస్ సీజన్9 అఫీషియల్ ప్రోమో వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే మరి





























