Vastu Tips For Children Bed Room: ఈ దిశలో పిల్లలకు గదిని ఏర్పాటు చేస్తే ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారట..

చెట్లు, మొక్కలు శ్రేయస్సుకు చిహ్నాలు. ఇంటి ప్రాంగణంలో చెట్లు, మొక్కలు ఉంటే అవి ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించడానికి పని చేస్తాయి. గుండ్రని ఆకారపు ఆకులు కలిగిన మొక్కలు శక్తి కోణంలో చాలా శుభప్రదమైనవి. అదే విధంగా ఇంట్లో పొడవైన, నిటారుగా ఉండే ఆకులు కలిగిన మొక్కలు అంత శుభప్రదమైనవిగా పరిగణింపబడం లేదు. నిమ్మ మొక్క శుభకరమైన మొక్క. అలాగే ఎవరైనా చిన్న మొక్కలను పెంచాలనుకుంటే ఇంటి తూర్పు దిశలో పెంచాలి. కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు.

Vastu Tips For Children Bed Room:  ఈ దిశలో పిల్లలకు గదిని ఏర్పాటు చేస్తే ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారట..
Vastu Tips For Children Bed Room
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jul 31, 2023 | 8:23 AM

ప్రతి సమస్యకు పరిష్కారం వాస్తు శాస్త్రంలో దాగి ఉంది.  ఎవరి ఇంట్లోనైనా వాస్తు ప్రకారం గదుల, వస్తువుల అమరిక లేకుండా ఉంటే.. అప్పుడు ఇంట్లోని వారు ఇబ్బందులు పడవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా లేకపోయినా.. తరచుగా అనారోగ్యం పాలైనా అప్పుడు వాస్తు దోషం ఉన్నట్లు పరిగణించాల్సి ఉంది. ఇంటిలో  తూర్పు లేదా ఆగ్నేయ దిశలో పిల్లలకు నిద్రించే గదిని ఏర్పాటు చేయండి. అయితే అప్పుడే పుట్టిన శిశువులకు ఆగ్నేయం, ఈశాన్య లేదా తూర్పు దిశలో గదులు మంచిది కాదు. పిల్లల గది దిశ సరిగ్గా లేకుంటే  అప్పుడు వారు తరచుగా అనారోగ్యంతో బాధపడతారు. కుమార్తె గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదు. అదే సమయంలో కొడుకు గదిని పశ్చిమ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు పడుకునే మంచం తల తూర్పు వైపు ఉండాలి. ఇంట్లో పిల్లవాడు అనారోగ్యంతో ఉంటే వాయువ్య మూలలో నిద్రపోయేలా ఏర్పాటు చేయండి.

ఇంట్లో చెట్లు, మొక్కలు ఎందుకు నాటాలంటే 

చెట్లు, మొక్కలు శ్రేయస్సుకు చిహ్నాలు. ఇంటి ప్రాంగణంలో చెట్లు, మొక్కలు ఉంటే అవి ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించడానికి పని చేస్తాయి. గుండ్రని ఆకారపు ఆకులు కలిగిన మొక్కలు శక్తి కోణంలో చాలా శుభప్రదమైనవి. అదే విధంగా ఇంట్లో పొడవైన, నిటారుగా ఉండే ఆకులు కలిగిన మొక్కలు అంత  శుభప్రదమైనవిగా పరిగణింపబడం లేదు. నిమ్మ మొక్క శుభకరమైన మొక్క. అలాగే ఎవరైనా చిన్న మొక్కలను పెంచాలనుకుంటే ఇంటి తూర్పు దిశలో పెంచాలి. కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

కాక్టస్ మొక్కలు

ఇల్లు లేదా కార్యాలయంలో కాక్టస్ మొక్కలు ఉంటే వాటిని తొలగించండి. ఈ మొక్కలు ప్రతికూల శక్తిని ఇస్తాయని నమ్మకం. పుష్పించే మొక్కలు శక్తిని అద్భుతంగా పెంచుతాయి.

ఇంటిలో కిటికీలు తక్కువగా ఉండాలి

మొక్కలు పెంచుకోవడం ఇష్టమైతే, ఇంట్లో ప్లాస్టిక్ కుండీలు లేకుండా చూసుకోవాలి. సరైన దిశలో కిటికీలు శ్రేయస్సును ఇస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో సానుకూల శక్తి , ప్రతికూల శక్తి అనే రెండు రకాల శక్తి ఉంటుంది. సానుకూల శక్తి శ్రేయస్సును ఇస్తుంది. ప్రతికూల శక్తి ఆనందం, శాంతిని దూరం చేస్తుంది. ఎవరి ఇల్లైనా సరే  సానుకూల శక్తితో నిండి ఉండాలని కోరుకుంటే, ఇంట్లో కిటికీలు సరైన దిశలో ఉండటం అవసరం. ఇంటికి కిటికీలను సూర్యకాంతి ప్రవేశించేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇది సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. ఇంటి కిటికీల అద్దాలు పగలకుండా, పగుళ్లు రాకుండా చూసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)